వరుసగా ఏడో రోజూ ఇవి ఏడిపించాయ్‌..

వరుసగా ఏడో రోజూ ఇవి ఏడిపించాయ్‌..

అనీల్‌ అంబానీ గ్రూప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాడుతోంది. వరుసగా ఏడోరోజూ రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాకయ్యాయి. తాకట్టులో ఉన్న షేర్లను రుణదాతలు వెనక్కి తీసుకోవడంతో ఈ కంపెనీలు గత 7 రోజులుగా నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. ఇవాళ కూడా రిలయన్స్‌ క్యాపిటల్‌ 5శాతం నష్టపోయిన రూ.18.05 వద్ద లాకైంది. దీంతో గత 7 రోజుల్లో ఈ స్టాక్‌ 30శాతం పైగా కరెక్షన్‌కు గురైంది. రిలయన్స్‌ క్యాపిటల్‌లో మొత్తం ప్రమోటర్లు తమ వాటాను 41.52 శాతం నుంచి 39.65 శాతానికి తగ్గించుకున్నారు. 

సెప్టెంబర్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్‌ తగ్గించింది. క్యాపిటల్‌ బాండ్స్‌ రేటింగ్‌ను  'BB' నుంచి 'D'కి తగ్గడంతో ఈ స్టాక్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. దీనికి తోడు పలు ఎన్‌సీడీల చెల్లింపులు డీఫాల్ట్‌ కావడం కూడా కంపెనీని ఇబ్బందిపెడుతోంది. 

ఇక రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విషయానికి వస్తే 5శాతం నష్టపోయి రూ.33.25 వద్ద లాకైంది. గత 7 రోజుల్లో ఈ స్టాక్‌ 29 శాతం నష్టపోయింది. గత 3 ట్రేడింగ్‌ సెషన్లలో 35 లక్షల షేర్లను రుణదాతలు వెనక్కి తీసుకున్నారు. నవంబర్‌ 18 నాటికి ఈ సంస్థలో ప్రమోటర్లకు 39.69 శాతం వాటా ఉండగా... ప్రస్తుతం ఇది 37.78 శాతానికి తగ్గింది.