2 నెలల గరిష్టానికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌

2 నెలల గరిష్టానికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌

వరుసగా నాల్గో రోజూ ఫార్మా షేర్లు జోరుమీదున్నాయి. సన్‌ఫార్మా లీడ్‌ చేయడంతో ఫార్మా ఇండెక్స్‌ 2 నెలల గరిష్టానికి చేరింది. మిడ్‌సెషన్‌లో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ మూడున్నర శాతం లాభంతో 8122 పాయింట్లను టచ్‌ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 13 తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. 

ఇంట్రాడేలో సన్‌ఫార్మా 7శాతం లాభపడి రూ.455 వద్ద ట్రేడవుతోంది. గత 4 ట్రేడింగ్‌ సెషన్స్‌లో సన్‌ఫార్మా 11 శాతం లాభపడింది. ఇది సెప్టెంబర్‌ 3 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. కంపెనీలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయమని సెబీ ఆర్డర్‌ చేయడంతో సన్‌ఫార్మా గత కొంతకాలంగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అక్టోబర్‌ 10 తర్వాత సన్‌ఫార్మాలో ర్యాలీ కొనసాగుతోంది. ఈ సమయంలో కనిష్ట స్థాయి రూ.380 నుంచి ప్రస్తుతం 20శాతం కోలుకుంది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 9శాతం లాభపడింది. 

ఇక మిగతా స్టాక్స్‌లో లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా 3 శాతం వరకు లాభపడ్డాయి. గత గురువారం నుంచి గ్లెన్‌మార్క్‌ ఫార్మా బౌన్స్‌ బ్యాక్‌ అవుతోంది. 52వారాల కనిష్ట స్థాయి నుంచి గ్లెన్‌మార్క్‌ ఫార్మా 37శాతం లాభపడింది. గ్లెన్‌మార్క్‌ ఫార్మా రేటింగ్‌ను గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ "SELL" నుంచి "BUY"కి అప్‌గ్రేడ్‌ చేయడంతో షేర్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది.