రూ.2 వేల నోట్ల గురించి మళ్లీ ఆర్థిక మంత్రి ప్రస్తావన !

రూ.2 వేల నోట్ల గురించి మళ్లీ ఆర్థిక మంత్రి ప్రస్తావన !

పెద్ద నోట్ల రద్దు దగ్గరి నుంచి రూ.2 వేల నోట్ హాట్ టాపికే. వీటిని కూడా ఎప్పుడో ఒకసారి రద్దు చేసి పారేస్తారని అందరి నోటా వినిపిస్తున్న మాట. అందుకే రూ.2 వేల నోట్లను పెద్దగా ఎవరూ దాచుకోవడం లేదు. ఎందుకంటే ఏ సమయంలో ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటనా చేయొచ్చే తెలియదు కాబట్టి మనోళ్లు రిస్క్ చేయలేకపోతున్నారు. బ్లాక్ మనీని దాచుకునే వాళ్లు కూడా ఎవరూ ధైర్యం చేయట్లేదని తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఇచ్చిన సమాధాన్ని బట్టి అర్థమవుతోంది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పట్టుబడిన మొత్తంలో 43.22 శాతం రూ.2 వేల నోట్లే ఉన్నాయి. అయితే ఇది అంతకు ముందు ఏడాది 60 శాతానికి పైగానే ఉంది. ఈ లెక్కన అక్రమంగా సొమ్మును దాచుకుంటున్న వాళ్లు కూడా పెద్ద నోట్ల జోలికి పోవడం లేదు. ఎందుకంటే.. ఎప్పుడు వీటికి కేంద్రం చెక్ పెడ్తుందో తెలియడం లేదు. 

ఈ మధ్యే ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర కూడా.. రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి సూచించారు.