యెస్ క్యాపిటల్‌ దగ్గర ఇక ఉన్నది 900 షేర్లే

యెస్ క్యాపిటల్‌ దగ్గర ఇక ఉన్నది 900 షేర్లే

యెస్ బ్యాంక్ ప్రమోటర్, మాజీ ఛైర్మన్ రాణా కపూర్‌ సహా మిగిలిన ప్రమోటింగ్ సంస్థలు బ్యాంకులో వాటాలను మెల్లిగా అమ్మేసుకుంటున్నాయి. ప్రస్తుతం రాణా కపూర్ వాటా బ్యాంకులో 3.92 శాతానికి దిగొచ్చింది (10 కోట్ల షేర్లు). కపూర్ కుటుంబం ప్రమోట్ చేసిన యెస్ క్యాపిటల్ ఇండియా సంస్థ తన దగ్గరున్న 2.425 కోట్ల షేర్లలో 2.424 కోట్ల షేర్లను గత మూడు, నాలుగు రోజుల క్రితం అమ్మేసింది. దీంతో రాణా కపూర్ దగ్గర వ్యక్తిగతంగా 10 కోట్ల షేర్లు, యెస్ క్యాపిటల్ ద్వారా కేవలం 900 షేర్లు మాత్రే మిగిలి ఉన్నాయి. 

గత మూడు నెలలుగా వీళ్ల వాటాలు గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నాయి. అదే సమయంలో కపూర్ ప్రమోట్ చేసిన మరో సంస్థ మోర్గాన్ క్రెడిట్స్ కూడా కుదువ షేర్లను విడిపించుకుని, ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మేస్తూ వస్తోంది. 

దీంతో బ్యాంక్ మనుగడపై ప్రమోటర్‌కే నమ్మకం సన్నగిల్లడం ఆందోళలను కలిగిస్తోంది.