డీల్ కుదుర్చుకోకపోతే చైనాకు పిచ్చెక్కిస్తా

డీల్ కుదుర్చుకోకపోతే చైనాకు పిచ్చెక్కిస్తా

అమెరికా - చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఓ కొలిక్కి వస్తోందని అనుకునే లోపే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి చైనాతో తమతో సయోధ్యకు వచ్చి ఒప్పందాలపై సంతకాలు చేయకపోతే మాత్రం గతంలో కంటే అధిక పన్నులు విధిస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ చర్చలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

మొదటి దశ చర్చలు సఫలీకృతమయ్యాయని, త్వరలోనే ఇరు దేశాలూ ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టబోతున్నారని ప్రపంచ ఆర్థిక వేత్తలంతా భావిస్తున్న తరుణంలో డోనాల్డ్ ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. వీటిని విశ్లేషించి చూస్తే.. అలాంటి సయోధ్య వాతావరణమేదీ అమెరికా - చైనా మధ్య కనిపించడం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో మళ్లీ అమెరికా సహా ఇతర ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటలోకి జారుకున్నాయి.