స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 20)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (నవంబర్ 20)

ఆర్‌ఐఎల్‌ : త్వరలో ఛార్జీలు పెంచనున్నట్లు ఎయిర్‌టెల్‌, ఐడియా వొడాఫోన్‌లు ప్రకటించిన ఒక రోజు వ్యవధిలో రిలయన్స్‌ జియో సైతం సంచలన నిర్ణయం
ఆర్‌ఐఎల్‌ :  రాబోయే కొద్ది వారాల్లో తాము కూడా మొబైల్‌ కాల్స్‌, డేటా ఛార్జీలు పెంచనున్నట్లు ప్రకటించిన రిలయన్స్‌ జియో
శ్రీ సిమెంట్‌ : క్యూఐపీ ఇష్యూ ప్రారంభం, ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.19806.46
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ : నవంబర్‌ 22న జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సమీకరణ అంశాన్ని చర్చించనున్న కంపెనీ
యునైటెడ్‌ బ్యాంక్‌: కేంద్రానికి రూ.1666 కోట్ల విలువైన 164 కోట్ల షేర్లను కేటాయించిన బ్యాంక్‌
బిర్లా కార్పొరేషన్‌: AMP సోలార్‌ క్లీన్‌ పవర్‌లో రూ.7.6 కోట్లకు 26శాతం వాటా కొనుగోలు చేసిన కంపెనీ
సీమెన్స్‌: క్యూ-2లో సీమెన్స్‌ నికరలాభం 18.4శాతం వృద్ధితో రూ.330.6 కోట్లుగా నమోదు
సీమెన్స్‌: రెండో త్రైమాసికంలో రూ.3189 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకున్న కంపెనీ
దిలీప్‌ బిల్డ్‌కాన్‌: నార్తన్‌ కోల్‌ఫీల్డ్స్‌ నుంచి రూ.2,122.74 కోట్ల ఆర్డరును దక్కించుకున్నట్లు ప్రకటన
ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ: యురేకా ఫోర్బ్స్‌ను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతోన్న కంపెనీ
సుందరమ్‌ ఫైనాన్స్‌: సుందరమ్‌ బీఎన్‌పీ పారిబాస్‌ హోమ్‌ ఫైనాన్స్‌ పేరు సుందరమ్‌ హోమ్‌ ఫైనాన్స్‌గా మార్పు
ఎన్‌బీసీసీ: ఢిల్లీలో నేషనల్‌ మ్యూజియాన్ని డెవలప్‌ చేసేందుకు రూ.500 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్న కంపెనీ
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌: సంస్థలో తమకున్న 9.2 శాతం వాటాలో 3% వాటాను రూ.2,800 కోట్లకు విక్రయించిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ కార్లే గ్రూప్‌
స్టెర్లింగ్‌ బయోటెక్‌: రుణదాతలకు బకాయిలు చెల్లించేందుకు  కంపెనీ ప్రమోటర్లకు 30 రోజుల సమయం ఇచ్చిన NCLAT

ఐపీఓ అప్‌డేట్స్‌..
- పబ్లిక్‌ ఇష్యూకు రానున్న కేరళకు చెందిన సీఎస్‌బీ బ్యాంక్‌
- ఈ నెల 22న ప్రారంభమై 26న ముగియనున్న పబ్లిక్‌ ఇష్యూ
- రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.193-195గా నిర్ణయం