లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో లాభ నష్టాల మధ్య  కొనసాగిన మార్కెట్లు చివరకు డే గరిష్ట స్థాయి వద్ద స్థిరపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఫార్మా స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతు లభించగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీలు అమ్మకాల ఒత్తడికి లోనయ్యాయి. మొత్తం మీద సెన్సెక్స్ ‌186 పాయింట్ల లాభంతో 40,470 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 11940 వద్ద ఇవాళ్టి ట్రేడింగ్‌ను ముగించాయి. 

భారతి ఎయిర్టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యెస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐలు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. ఇక నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌ విషయానికి వస్తే భారతి ఇన్‌ఫ్రాటెల్‌, భారతి ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లు 2.50-10.50 శాతం లాభపడ్డాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యెస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, టాటాస్టీల్‌లు 2-3 శాతం నష్టంతో నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.