ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ సూచీలు

ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కదలాడుతోన్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో దేశీయ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 51 పాయింట్ల లాభంతో 40335 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11897 వద్ద కదలాడుతోన్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప లాభంతో 31 వేల ఎగువన ట్రేడవుతోంది. ముఖ్యంగా ముఖ్యంగా మెటల్‌ షేర్లు కరెక్షన్‌కు గురవుతోన్నాయి. ఐటీ, టెక్నాలజీ కౌంటర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి 71.91 వద్ద ట్రేడవుతోంది. 

నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌ విషయానికి వస్తే భారతి ఎయిర్‌టెల్, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా, గ్రాసీం, టెక్‌మహీంద్రాలు 2శాతం నుంచి 6.50శాతం లాభంతో ట్రేడవుతోన్నాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వేదాంతా, హిందాల్కో, హీరోమోటోకార్ప్‌, గెయిల్‌లు 1-2 శాతం నష్టంతో కొనసాగుతోన్నాయి. 

ఎస్‌బీఐలో బ్లాక్‌డీల్‌ - షేర్‌ డౌన్‌
ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎస్‌బీఐ లైఫ్‌లో బ్లాక్‌ డీల్‌ జరిగింది. దీంతో 5.6శాతం షేర్లు అంటే సుమారు 3.3 కోట్ల షేర్లు చేతులు మారాయి. దీంతో ప్రస్తుతం ఎస్‌బీఐ లైఫ్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ప్రస్తుతం 6శాతం పైగా నష్టంతో ట్రేడవుతోంది.