జోరుమీదున్న బీపీసీఎల్

జోరుమీదున్న బీపీసీఎల్

బీపీసీఎల్‌లో వాటాలను విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏడాది మార్చినాటికి డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.లక్ష కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీపీసీఎల్‌ 4శాతం జంప్‌ చేసింది. ప్రస్తుతం 3శాతం లాభంతో రూ.523.20 వద్ద బీపీసీఎల్‌ ట్రేడవుతోంది. 

ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌లో వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి వాటా విక్రయం పూర్తయ్యే అవకాశముందని ఆమె చెప్పారు. దీనికి సంబంధించి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని ఆమె అన్నారు.