మార్కెట్లు ప్లస్‌- ఈ షేర్లు కుదేల్‌

మార్కెట్లు ప్లస్‌- ఈ షేర్లు కుదేల్‌

మూడు రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపారు. దీంతో ఈ  కౌంటర్లు నష్టాలతో డీలాపడ్డాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, ప్రైమ్‌ ఫోకస్‌ లిమిటెడ్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ లిమిటెడ్‌, నెక్టార్‌ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌: హెల్త్‌కేర్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమైంది. రూ. 144 దిగువకు చేరింది. ఇంట్రాడేలో రూ. 161 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం గమనార్హం. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7.5 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 25.67 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌: హెల్త్‌కేర్‌ రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమైంది. కొనుగోలుదారులు కరవుకావడంతో రూ. 77.35 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 39600 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 7000 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

తేజాస్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌: బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ పరికరాల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 67.4కు చేరింది. తొలుత రూ. 64 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) పరిమాణం 9300 షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 19300 షేర్లు ట్రేడయ్యాయి. 

ప్రైమ్‌ ఫోకస్‌ లిమిటెడ్‌: విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించే స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో రూ. 67.15 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) ట్రేడింగ్‌ పరిమాణం 99000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 46,300 షేర్లు ట్రేడయ్యాయి. 

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ లిమిటెడ్‌: ఇంజినీరింగ్‌ రంగ ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో రూ. 401 దిగువన ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) ట్రేడింగ్‌ పరిమాణం 3,650 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 5,300 షేర్లు ట్రేడయ్యాయి. 

నెక్టార్‌ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌: ఫార్మా రంగ ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 14 శాతం పతనమైంది. రూ. 12.9కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) ట్రేడింగ్‌ పరిమాణం 25,650 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 70,300 షేర్లు ట్రేడయ్యాయి.