ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (నవంబర్ 15)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (నవంబర్ 15)
 • సిప్లాకు చెందిన పతల్‌గంగా ప్లాంట్‌కు సంబంధించి 4 అభ్యంతరాలు వ్యక్తం చేసి యూఎస్‌ఎఫ్‌డీఏ
 • రూ.385 కోట్ల విలువైన డిబెంచర్లను కేటాయించిన బజాజ్‌ ఫైనాన్స్‌
 • స్టెర్లింగ్‌ టూల్స్‌ సీఎఫ్‌ఓ నారాయణ్‌ విజయ్‌ గోపాల్‌ రాజీనామా, డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
 • 2.02 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు అంగీకరించిన మోయిల్‌ బోర్డు
 • వడిలాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆడిటర్లు డెలాయిట్‌ హాస్కిన్స్‌ రాజీనామా
 • రెండు అనుబంధ సంస్థలను విలీనం చేసుకునేందుకు దాల్మియా భారత్‌ బోర్డు అంగీకారం
 • అరబిందో ఫార్మాకు చెందిన హైదరాబాద్‌ యూనిట్‌-4పై యూఎస్‌ఎఫ్‌డీఏ 14 అభ్యంతరాలు, నిర్దేశించిన గడువులోపు లోపాలు సరిదిద్దుతామన్న కంపెనీ
 • క్యూ-2లో రూ.18 కోట్ల నుంచి రూ.72.31 కోట్లకు పెరిగిన సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం
 • రెండో త్రైమాసికంలో రూ.1194 కోట్లుగా నమోదైన యూనియన్‌ బ్యాంక్‌ నికరనష్టం, గత ఏడాది ఇదే సమయంలో రూ.139 కోట్లుగా ఉన్న నికరలాభం
 • క్యూ-2లో మరింత పెరిగిన జీవీకే పవర్‌ నష్టాలు, రూ.109 కోట్ల నుంచి రూ.159 కోట్లకు పెరిగిన నికర నష్టం
 • క్యూ-2లో రూ.63.5 కోట్ల నుంచి రూ.86.2 కోట్లకు పెరిగిన అపోలో హాస్పిటల్స్‌ నికరలాభం
 • సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసింకలో రూ.23,045 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసిన భారతీ ఎయిర్‌టెల్‌
 • క్యూ-2లో రూ.4874 కోట్ల నుంచి రూ.50,921 కోట్లకు పెరిగిన వొడాఫోన్‌ ఇండియా నికరనష్టం
 • ఐఓసీలో వాటా విక్రయించే యోచనలో ప్రభుత్వం, 26 శాతానికి పైగా వాటా ఉపసంహరించుకునే అవకాశం
 • రెండో త్రైమాసికంలో 36.2శాతం క్షీణతతో రూ.5276 కోట్లుగా నమోదైన ఓఎన్‌జీసీ నికరలాభం
 • విశాఖపట్నంలోని ఫినిష్డ్‌ డోసేజ్‌ ఫార్ములేషన్స్‌ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన  నాట్కో ఫార్మా
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న బీఎస్‌ఎల్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, ఓరియంట్‌ గ్రీన్‌ పవర్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న అపోలో మైక్రో సిస్టమ్స్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, శిల్పా మెడికేర్‌
 • అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు
 • కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్‌, ఆర్చిట్‌ ఆర్గనొసిస్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు