ఎపెక్స్ ఫ్రోజెన్‌- ముత్తూట్‌ హైజంప్‌

ఎపెక్స్ ఫ్రోజెన్‌- ముత్తూట్‌ హైజంప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆక్వాకల్చర్‌ కంపెనీ ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌  కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ నికర లాభం 11 శాతం ఎగసి రూ. 22 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 269 కోట్లను తాకింది.  నిర్వహణ లాభం మరింత అధికంగా 49 శాతం జంప్‌చేసి రూ. 37 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ఎపెక్స్‌ ఫ్రోజెన్ ఫుడ్స్‌  షేరు తొలుత ఎన్‌ఎస్ఈలో 15 శాతం దూసుకెళ్లి రూ. 347 సమీపానికి చేరింది. ప్రస్తుతం 10 శాతం జంప్‌చేసి రూ. 331 వద్ద ట్రేడవుతోంది. 

Related image

ముత్తూట్‌ ఫైనాన్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నికర లాభం 77 శాతం ఎగసి రూ. 900 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 41 శాతం బలపడి రూ. 1047 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం సైతం 35 శాతం పుంజుకుని రూ. 1631 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9.5 శాతం జంప్‌చేసి రూ. 711 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 714 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.