ఫారిన్ ఇన్వెస్టర్ల పంట పండించిన 12 స్టాక్స్ ఇవే..!

ఫారిన్ ఇన్వెస్టర్ల పంట పండించిన 12 స్టాక్స్ ఇవే..!

' కార్పోరేట్ ట్యాక్స్ కట్‌ ' విధానంతో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (FIPs) దేశీయ మార్కెట్లలోకి దాదాపు రూ. 38,000 కోట్ల పెట్టుబడులను మళ్ళించారు. వీరి నమ్మకాన్ని వమ్ము కానీకుండా దాదాపు BSE లోని ఓ 12 స్టాక్స్ వీరి సంపదను రెట్టింపు చేసిపెట్టాయి. ఈ సెప్టెంబర్ 20 నాటికి 20 నుండి 80శాతం రిటర్న్స్ ను అందించిన స్టాక్స్ ఎంటో మనమూ చూద్దామా..!
అదానీ గ్రీన్ ఎనర్జీ : 
రేట్ కట్ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత అదానీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 81.57శాతం పెరిగింది. గత బుధవారం నాడు కంపెనీ రెండో క్వార్టర్‌లో రూ. 102 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు పేర్కొంది. ఈ కంపెనీలో  విదేశీ ఇన్వెస్టర్లు 20.36శాతం వాటాలను కలిగి ఉన్నారు. 
బ్లిస్ GVS ఫార్మా: 
బ్లిస్ జీవీఎస్ ఫార్మా స్టాక్స్ రేట్ కట్ తరువాత దాదాపు 33శాతం పెరిగాయి. ఈ కంపెనీలో FPIs 24.54శాతం వాటాలను కలిగి ఉన్నారు. 
యెస్ బ్యాంక్:
ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న యెస్ బ్యాంక్‌లో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు మూడో వంతు వాటాలను కలిగి ఉన్నారు. అయితే గత 34 రోజుల్లో ఈ స్టాక్ 33 శాతం పెరిగి FPIs లకు లాభాలను అందించింది. 
మణప్పురం ఫైనాన్స్ : 
తమిళనాడుకు చెందిన మణప్పురం ఫైనాన్స్ లో FPIs 44.68 శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఈ స్టాక్ సెప్టెంబర్ చివరి నాటికి 31 శాతం పెరిగింది. 
ఫోర్టీస్ హెల్త్ కేర్ : 
ఫోర్టీస్‌ కంపెనీలో 38.77 శాతం వాటాలను కలిగి ఉన్నారు FPIs. ఫోర్టీస్‌ హెల్త్ కేర్‌ స్టాక్స్  గత సెప్టెంబర్ చివరి నాటికి 23శాతం పెరిగింది. 
MCX : 
ఈ కంపెనీలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు 26శాతం వాటాలను కలిగి ఉన్నారు. MCX స్టాక్ కూడా రానున్న 2-3 నెలల్లో మంచి ప్రాఫిట్లను అందించనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ;
ఈ కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లు 30శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఈ స్టాక్ కూడా 20శాతం లాభపడింది. 

ఇవే కాకుండా మ్యాక్స్ ఇండియా, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, అదానీ ట్రాన్స్‌మిషన్, IGL,ఇన్ఫో ఎడ్జ్, వంటి FPIs తీసుకున్న స్టాక్స్ దాదాపు 25-30 శాతం పెరిగాయి. కాగా గత అగస్టులో  విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులు రూ. 12,418 కోట్లు కాగా, గత అక్టోబర్  చివరి నాటికి రూ. 17,592 కోట్లు పెట్టుబడులను పెంచారు.