మార్కెట్లు వీక్‌.. ఈ షేర్లు స్పీడ్‌

మార్కెట్లు వీక్‌.. ఈ షేర్లు స్పీడ్‌

వరుసగా మూడో రోజు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు మాత్రం డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ కౌంటర్లు మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ లిమిటెడ్‌, రోసెల్‌ ఇండియా లిమిటెడ్‌, బన్స్‌వారా సింటెక్స్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్‌: చక్కెర తయారీ రంగంలోని ఈ కంపెనీ కౌంటర్లో కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువయ్యారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 196 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 19000 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 94,000 షేర్లు  ట్రేడయ్యాయి.

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌: పెట్టుబడుల నిర్వాహక ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 358 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 3.5 లక్షల షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 3.73 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌: పొగాకు ఉత్పత్తుల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం పెరిగింది. రూ. 1231ను తాకింది. ఇంట్రాడేలో రూ. 1254 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 8300 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 13500 షేర్లు ట్రేడయ్యాయి.

ఎస్సెల్‌ ప్రొప్యాక్‌ లిమిటెడ్‌: ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా తదితర ప్యాకేజింగ్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.5 శాతం జంప్‌చేసింది. రూ. 140కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 5,000 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 13,000 షేర్లు ట్రేడయ్యాయి.

రోసెల్‌ ఇండియా లిమిటెడ్‌: టీ, ఆతిథ్య రంగ ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు అమ్మేవాళ్లు కరువుకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 74 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 350 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 57,000 షేర్లు ట్రేడయ్యాయి. 

బన్స్‌వారా సింటెక్స్‌ లిమిటెడ్‌: ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్స్‌ రంగ ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు కొనేవాళ్లు అధికమై ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 91.3 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 1350 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 46,400 షేర్లు ట్రేడయ్యాయి.