ఈ 45 స్టాక్స్ ఫ్యూచర్ గోల్డ్ మైన్స్..!

ఈ 45 స్టాక్స్ ఫ్యూచర్ గోల్డ్ మైన్స్..!

స్టాక్స్‌ మీద పెట్టుబడులు పెట్టడంలో సమయోచిత నిర్ణయాలే లాభాలను తీసుకొస్తాయి. దోరగా ఉన్నప్పుడే తీసుకోవడం, అది పండిన సమయంలో అమ్మేయడం అన్నది ఎనలిస్టుల ముఖ్య సూచన.BSE లోని లిస్టెడ్ స్టాక్స్‌లో డాటా ప్రకారం దాదాపు ఓ 45 స్టాక్స్ భవిష్యత్తులో వృద్ధిని కనబరచనున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఈ లిస్టులో స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ..వీటిలో కొన్ని మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాక్స్ ప్రస్తుతం చౌకగా లభిస్తుండటం మరో విశేషం అని బ్రోకింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. 
భవిష్యత్తులో బంగారు నిధులుగా చెప్తున్న వీటిలో HCL టెక్, భారత్ పెట్రోలియమ్, HPCL, బజాజ్ ఆటో స్టాక్స్ లార్జ్ క్యాప్ రంగంలో ఉండగా, ముత్తూట్ ఫిన్, భారత్ ఎలక్ట్రానిక్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, గుజరాత్ గ్యాస్  స్టాక్స్ మిడ్ క్యాప్ రంగంలో ఉన్నాయి. మిగతావన్నీ స్మాల్ క్యాప్ స్టాక్స్ గా ఉన్నాయి. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ , హెడిల్ బర్గ్ సిమెంట్, జస్ట్ డయల్, బలరాంపూర్ చీనీ మిల్స్, PSP ప్రాజెక్ట్స్ , హింద్ రెక్టిఫైయర్స్ వంటివి స్మాల్ క్యాప్ రంగానికి చెందినవి.   
ఈ జాబితాలోని 45 కంపెనీల షేర్లు.. గత 12 నెలల PE రేషియోను చూస్తే.. RoCE (రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ) 15 శాతానికి పైగా నమోదు చేశాయి. వార్షికంగా చూస్తే.. ఈ 45 స్టాక్స్ గుడ్ రిటర్న్స్‌ను అందించాయి. టెక్నికల్ ఛార్టుల్లో ఇవ్వన్నీ గొల్డెన్ క్రాస్‌ను ఇండికేట్ చేస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. షార్ట్‌ టర్మ్ సూచీ (50-DMA) , లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్‌ (200-DMA) ను దాటినప్పుడు గోల్డెన్ క్రాస్‌ ఏర్పడుతుంది. ఇది బుల్లిష్ ఓవర్ టోన్‌ను సూచిస్తుంది. 

cheap-thrills


HDFC సెక్యూరిటీస్ ఆటో రంగంలోని స్టాక్స్‌లో బజాజ్ ఆటోను ఫేవరెట్ గా పేర్కొంది. బజాజ్ ఆటో షేర్లకు బై రేటింగ్‌ను ఇస్తూ..టార్గెట్ ప్రైస్‌ రూ. 3,447 గా నిర్ణయించింది. అటో రంగం క్షీణతను ఎదుర్కొన్నప్పటికీ.. ఇయర్ టు డేట్ ప్రకారం ఈ స్టాక్ దాదాపు 20శాతం వృద్ధిని కనబరిచింది. 2019లో లార్జ్ క్యాప్‌ స్టాక్స్ మెరుగ్గా రాణించాయి. కానీ ఇదే సమయంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలు అంతగా రాణించలేదు. BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 8శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 4శాతం క్షీణతను ఎదుర్కొన్నాయి. ఎనలిస్టుల అంచనా ప్రకారం త్వరలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు ర్యాలీని అందుకోనున్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ ను ఎంపిక చేసుకోడం ఉత్తమమని, లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద కంటే వీటి మీదే పెట్టుబడులు లాభాలనిస్తాయని మోతీలాల్ ఓశ్వాల్ సంస్థ భావిస్తుంది. 
రైట్స్ (RITES) కంపెనీ స్టాక్స్ మీద యాక్సిస్ సెక్యురిటీస్ బై రికమెండేషన్స్ ను ఇస్తుంది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యు, స్ట్రాంగ్ అట్రాక్టివ్ వాల్యూమ్స్, హెల్దీ ఫైనాన్షియల్స్ , హై డివిడెండ్ ను చెల్లించడం వంటి కారణాలతో  రైట్స్ కంపెనీ స్టాక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇక మిడ్ క్యాప్ స్టాక్స్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ ను ఉత్తమ ఎంపికగా ఆనంద్ రాఠీ పేర్కొంటుంది. ఈ సంవత్సరంలో భారత్ ఎలక్ట్రానిక్స్ స్టాక్స్ రూ. 135 వద్దకు చేరుకుందని, పొటెన్షియల్ గ్రోత్ 23శాతం దాకా కనబరిచింది కాబట్టి ఈ షేర్ అప్‌ట్రెండ్‌లో ఉంటుందని ఆనంద్ రాఠీ అంటుంది. అలాగే మిడ్ క్యాప్ రంగంలోని దీపక్ నైట్రేట్ కూడా ఈ సంవత్సరం దాదాపు 60శాతం వృద్ధిని కనబరిచింది. రిఫెక్స్ ఇండస్ట్రీస్ 150శాతం, అయాన్ (ION) ఎక్స్‌ఛేంజ్ 126 శాతం, ఎవరెస్ట్ ఆర్గానిక్స్ 108 శాతం గ్రోత్‌ను కనబరిచాయి. సుయోగ్ టెలిమాటిక్స్ కూడా దాదాపు ఈ సంవత్సరం 94శాతం వృద్ధిని కనబరిచింది.