గత 10 ఏళ్ళ నుండి అదరగొడ్తున్న స్మాల్ క్యాప్ స్టాక్ ఇదే! 1000 శాతం రిటర్న్స్ !

గత 10 ఏళ్ళ నుండి అదరగొడ్తున్న స్మాల్ క్యాప్ స్టాక్ ఇదే! 1000 శాతం రిటర్న్స్ !

గత రెండేళ్ళుగా BSE లోని స్మాల్ క్యాప్ ఇండెక్స్ డౌన్‌ఫాల్‌నే చవి చూస్తూ వచ్చింది. అంతకు ముందు కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు క్షీణతనే ఎదుర్కొన్నాయి. కానీ గత పదేళ్ళుగా మార్కెట్ ట్రెండ్‌ను , అంచనాలను తారు మారు చేస్తూ ఓ స్మాల్ క్యాప్ కంపెనీ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. హై గ్రోత్ పొటెన్షియాల్టీ, డెబిట్ ఫ్రీ స్టేటస్, హైలీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోతో , స్ట్రాంగ్ ఆర్డర్‌ బుక్‌తో ఎనలిస్టుల మదిని దోచేసింది ఈ స్మాల్ క్యాప్ స్టాక్. 
క్రిటికల్ ప్రాసెస్ ఎక్విప్‌మెంట్‌ను సరఫరా చేసే GMM ఫోద్లార్ సంస్థ ప్రముఖ గ్లోబల్ కెమికల్ కంపెనీలకు, బడా ఫార్మా ఇండస్ట్రీలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీ స్టాక్స్ 2009 నవంబర్‌ లో రూ. 90 వద్ద ట్రేడ్ అవ్వగా, ఇదే స్టాక్స్ 2019 నవంబర్‌ నాటికి రూ. 1450 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ పదేళ్ళలో దాదాపు 1,500 శాతం గ్రోత్‌ను కనబరిచింది GMM ఫోద్లార్. ఫార్మా సెక్టార్‌లోని కెమికల్ ప్రాసెసింగ్, ఆగ్రోకెమికల్స్ తయారీ వంటి వాటికి వాడే గ్లాస్‌ లైన్ (GL) స్టీల్ ఎక్విప్‌మెంట్‌ను GMM సరఫరా చేస్తుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ GMM ఫోద్లార్‌కు బై రేటింగ్‌తో బాటు టార్గెట్ ప్రైస్‌ రూ. 1,849 గా అంచనా వేస్తోంది. వృద్ధి రేటు 25 రెట్లుగా నిర్ణయించింది . వార్షిక పరంగా చూస్తే..  దాదాపు 45శాతం గ్రోత్‌ GMM ఫోద్లార్ కంపెనీ ఆర్డర్‌ బుక్‌లో కనబడుతోంది.
అలాగే ఈ కంపెనీ సేల్స్ 2017 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ. 350.3 కోట్లు కాగా, అదే 2020 చివరి నాటికి రూ. 632 కోట్లుగా ఉంది. నెట్ ప్రాఫిట్ 2017లో 33.3 కోట్లు కాగా, అదే 2020 నాటికి 80.1 కోట్లుగా ఉంది. 2017లో ఈ కంపెనీ షేర్ EPS (ఎర్నింగ్ పర్ షేర్ ) 22.8 గా ఉండగా, అదే 2020 నాటికి అది 54.8 గా ఉండటం గమనార్హం. ఎంజిల్ బ్రోకింగ్ సంస్థ GMM కు బై రేటింగ్స్ తో బాటు టార్గెట్ ప్రైస్‌ రూ. 1,740 గా నిర్ణయించింది. రానున్న రెండేళ్ళలో దాదాపు 25-30 శాతం వృద్ధి రేటును సాధించగలదని అంచనా వేస్తోంది. ఇంతకీ  మీ పోర్ట్ ఫోలియోలో ఈ స్టాక్‌ ఉందా ..? మరెందుకాలస్యం త్వరపడండి మరి !


Disclaimer: పైన పేర్కొన్న వివరాలు , సమాచారం ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, ఎనలిస్టులచే ఇవ్వబడినది మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.