ఎంఅండ్‌ఎం- ఐషర్‌.. Q2 రిలీజ్‌

ఎంఅండ్‌ఎం- ఐషర్‌.. Q2 రిలీజ్‌

ఆటో రంగ దిగ్గజాలు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంఅండ్‌ఎం లిమిటెడ్‌ షేరు నామమాత్ర లాభంతో రూ. 582 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 597 వద్ద గరిష్టాన్నీ, రూ. 577 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ షేరు 1.4 శాతం బలపడి రూ. 21714 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 22,056 వద్ద గరిష్టాన్నీ, రూ. 21,200 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఫలితాల వివరాలు చూద్దాం..

ఎంఅండ్‌ఎం-ఎంవీఎంఎల్‌ 
దేశీ ఆటో రంగ దిగ్గజం ఎంఅండ్‌ఎం-ఎంవీఎంఎల్‌ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రూ. 1355 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 24 శాతం తక్కువకాగా.. మొత్తం ఆదాయం సైతం 15 శాతం వెనకడుగుతో రూ. 10935 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 17 శాతం నీరసించి రూ. 1541 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 14.5 శాతం నుంచి 14.1 శాతానికి స్వల్పంగా బలహీనపడ్డాయి. పన్ను వ్యయాలు రూ. 519 కోట్ల నుంచి రూ. 403 కోట్లకు తగ్గాయి. ఆటోమోటివ్‌ బిజినెస్‌ ఆదాయం 18 శాతం తిరోగమించి రూ. 6893 కోట్లకు చేరగా.. ఇబిటా 40 శాతం క్షీణించి రూ. 397 కోట్లకు పరిమితమైంది. ఇబిట్‌ మార్జిన్లు 7.3 శాతం నుంచి 5.8 శాతానికి నీరసించాయి. ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ ఆదాయం 10 శాతం తగ్గి రూ. 3631 కోట్లుగా నమోదుకాగా.. ఇబిటా 14 శాతం క్షీణించి రూ. 702 కోట్లను తాకింది.

Image result for eicher motors ltd

ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో దేశీ ఆటో రంగ దిగ్గజం ఐషర్‌ మోటార్స్‌ నికర లాభం 4.5 శాతం పుంజుకుని రూ. 573 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 9 శాతం క్షీణించి రూ. 2192 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం సైతం 26 శాతం వెనకడుగుతో రూ. 541 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 30.3 శాతం నుంచి 24.7 శాతానికి బలహీనపడ్డాయి. ఇతర ఆదాయం 54 శాతం ఎగసి రూ. 145 కోట్లకు చేరింది.