ఈ షేర్లకు.. కొనుగోళ్ల జోష్‌!

ఈ షేర్లకు.. కొనుగోళ్ల జోష్‌!

వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెనకడుగు వేస్తున్నాయి. స్వల్ప నష్టాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, బాంబే డయింగ్‌&మ్యాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ, ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఓమ్‌ మెటల్స్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, ఎస్‌పీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌: ఫైనాన్షియల్‌ సేవల రంగంలోని ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.3 శాతం జంప్‌చేసింది. రూ. 139కు చేరింది. ఇంట్రాడేలో రూ. 146 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 1.01 లక్షల షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 29,200 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.

బాంబే డయింగ్‌&మ్యాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ: టెక్స్‌టైల్స్‌ రంగ ఈ కంపెనీ షేరు కొనేవాళ్లు అధికమై ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 12.5 శాతం దూసుకెళ్లింది. రూ. 97 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 3.32 లక్షల షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 7.73 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

ఎపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌: ఈ ప్రయివేట్‌ రంగ ఆక్వాకల్చర్ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13.5 శాతం పెరిగింది. రూ. 317ను తాకింది. ఇంట్రాడేలో రూ. 327ను సైతం అధిగమించింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 22,000 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 1.9 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

ఓమ్‌ మెటల్స్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌: మౌలిక సదుపాయాల రంగ ఈ స్మాల్‌ క్యాప్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 17.5 శాతం దూసుకెళ్లింది. రూ. 24.6కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 3,400 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 10,500 షేర్లు ట్రేడయ్యాయి.

ఎస్‌పీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌: కాటన్‌ దుస్తుల తయారీ ఈ టెక్స్‌టైల్స్‌ రంగ ఈ స్మాల్‌ క్యాప్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 12 శాతం జంప్‌ చేసింది. రూ. 34ను తాకింది. ఇంట్రాడేలో రూ.36ను అధిగమించింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 1700 షేర్లుకాగా.. మిడ్‌ సెషన్‌కల్లా 11,000 షేర్లు ట్రేడయ్యాయి.