రుపీ డీలా- 71.23కు

రుపీ డీలా- 71.23కు

ముందురోజు లాభనష్టాల మధ్య కన్సాలిడేట్‌ అయిన దేశీ కరెన్సీ తిరిగి పతన బాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ప్రస్తుతం రూపాయి 26 పైసలు కోల్పోయి 71.23 వద్ద ట్రేడవుతోంది. గురువారం ట్రేడింగ్‌లో తొలుత 10 పైసలు బలహీనపడటం ద్వారా సాంకేతికంగా కీలకమైన 71 మార్క్‌ దిగువకు నీరసించింది. అయితే తదుపరి కోలుకుని చివరికి 70.97 వద్ద యథాతథంగా ముగిసింది. కాగా.. డాలరుతో మారకంలో రూపాయి బుధవారం 28 పైసలు క్షీణించి 70.97 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత శుక్రవారం(1న)  11 పైసలు పుంజుకున్న రూపాయి సోమవారం(4న) 4 పైసలు, మంగళవారం(5న) 8 పైసలు చొప్పున లాభపడింది. ఫలితంగా డాలరుతో మారకంలో మంగళవారం ఐదు వారాల గరిష్టం 70.69 వద్ద నిలిచింది. 

నేలచూపులో
డాలరుతో మారకంలో రూపాయి 2018లో 9 శాతం క్షీణించగా.. ఈ ఏడాది(2019) ఇప్పటివరకూ 4 శాతం తిరోగమించింది. ఫలితంగా ఈ సెప్టెంబర్‌ 3న 72.40 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే తదుపరి రూపాయి జోరందుకుని 2 శాతం పుంజుకుంది. ఇందుకు వర్ధమాన దేశాల కరెన్సీలు బలపడటం, దేశీ కేపిటల్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు, ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలు దోహదపడినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');