Q2- వొకార్డ్‌ వీక్‌- యూబీఎల్‌ అప్‌

Q2- వొకార్డ్‌ వీక్‌- యూబీఎల్‌ అప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాలు మెప్పించనప్పటికీ లిక్కర్‌ తయారీ దిగ్గజం యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌(యూబీఎల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వెరసి వొకార్డ్‌ షేరు నష్టాలతో డీలాపడగా.. యూబీఎల్‌ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

వొకార్డ్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో వొకార్డ్‌ లిమిటెడ్‌ రూ. 83 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 29 శాతం క్షీణించి రూ. 802 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 17 శాతం వెనకడుగుతో రూ. 43 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 4.7 శాతం నుంచి 5.4 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వొకార్డ్‌ లిమిటెడ్‌ షేరు 2.5 శాతం నీరసించి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 283 వరకూ పతనమైంది.

Related image

యూబీఎల్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో యూబీఎల్‌ లిమిటెడ్‌ నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 115 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పెరిగి రూ. 1580 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 39 శాతం నీరసించి రూ. 192 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 20.7 శాతం నుంచి 12.2 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యూబీఎల్‌ లిమిటెడ్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 1278 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1296కు ఎగసింది.  



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');