ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌- వర్ల్‌పూల్ జోరు

ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌- వర్ల్‌పూల్ జోరు

చత్తీస్‌గఢ్‌లోని కోల్‌ మైన్‌ను సొంతం చేసుకోనున్న వార్తలతో ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ కంపెనీ ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో వైట్‌గూడ్స్‌ దిగ్గజం వర్ల్‌పూల్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వెరసి ఈ  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తోందిషేరు రెండేళ్ల కనిష్టానికి చేరింది. వివరాలు చూద్దాం..

ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేలంలో చత్తీస్‌గఢ్‌లోని భాస్కరపారా కోల్‌ మైన్‌కు గరిష్ట బిడ్డర్‌గా నిలిచినట్లు మైనింగ్‌, స్టీల్, పవర్‌ బిజినెస్‌ల కంపెనీ ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. 8వ కోల్‌ బ్లాక్‌ల వేలంలో భాగంగా భాస్కరపారాను దక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఈ మైన్‌ 24 మిలియన్‌ టన్నులకుపైగా రిజర్వులను కలిగి ఉన్నట్లు వివరించింది. తద్వారా ఇదే రాష్ట్రంలో గల సమీకృత స్టీల్‌ ప్లాంటుకి కోల్‌ను సమకూర్చుకునే వీలున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 56 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 60 వరకూ ఎగసింది.

వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో హోమ్‌ అప్లయెన్సెస్‌ దిగ్గజం వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ రూ. 129 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది దాదాపు 64 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 1393 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వర్ల్‌పూల్‌ ఇండియా షేరు 2.5 శాతం పుంజుకుని రూ. 2187 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2222 వరకూ ఎగసింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');