ఈ స్టాక్స్‌లో వాటాలు పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..!

ఈ స్టాక్స్‌లో వాటాలు పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..!

గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న స్టాక్స్ ఏమైనా ఉంటే అవి లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే. దలాల్ స్ట్రీట్‌లో ఈ బ్లూచిప్ షేర్లు మంచి రిటర్న్స్‌నే అందిస్తూ వచ్చాయి. అందుకే ఫండ్ మేనేజర్లు వీటిపై అపార ప్రేమను కనబరుస్తూ వచ్చారు. ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో పలు ఫండ్ మేనేజర్లు వీటి మీదనే తమ పెట్టుబడులను పెంచారు. దాదాపు 338 కంపెనీల్లో తమ ఇన్వెస్ట్‌మెంట్‌ను పెంచారు. ఏస్‌ ఈక్విటీ వెల్లడించిన సమాచారం మేరకు పలు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు లార్జ్ క్యాప్ స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ను పొందాయి. 
రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, HDFC బ్యాంక్, HUL, HDFC లిమిటెడ్, ITC, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్, SBI, యాక్సిస్ బ్యాంక్, L&T, భారతీ ఎయిర్ టెల్, ONGC, ఏషియన్ పేయింట్స్, విప్రో వంటి స్టాక్స్ లో MF కంపెనీలు తమ పెట్టుబడులను పెంచాయి. 2017 నుండి బ్లూచిప్ షేర్లు ఫ్లేవర్డ్ స్టాక్స్ గా ఉంటూ వస్తున్నాయి..మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు. అందుకే వీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపే మొగ్గు చూపారని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు. 
అలాగే లార్జ్ క్యాప్‌ స్టాక్స్ మీద రిస్క్ తక్కువగా ఉండటం, మిడ్ క్యాప్ పరవాలేదనిపించినా.. రానున్న రెండేళ్ళ కాలంలో అవి ఎలా స్పందిస్తాయో తెలియకపోవడం, ఇక స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద పూర్తి రిస్క్ ఉండటంతో MF కంపెనీలు లార్జ్ క్యాప్‌ రంగం మీదే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

Image17112019

Pic Source: Moneycontrol 
ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు దాదాపు 297 కంపెనీల స్టాక్స్ ను వదిలించుకున్నాయి. వీటిలో బాటా ఇండియా, MCX, PI ఇండస్ట్రీస్, సీమెన్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, బంధన్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, డాబర్ ఇండియా, M&M , వంటి స్టాక్స్ ఉన్నాయి. ప్రధానంగా మెటల్, ఆటో, FMCG రంగాల స్టాక్స్ ను MF కంపెనీలు వదిలించుకున్నాయి. మరి కొన్ని స్టాక్స్ లో తమ పెట్టుబడులను తగ్గించుకున్నాయి. 
Image27112019

Pic Source: Moneycontrol 


కాగా ఈ 297 స్టాక్స్ లో దాదాపు 15 స్టాక్స్ వరుసగా 50 శాతం అప్‌ట్రెండ్‌తో ర్యాలీని కనసాగించినా.. MF కంపెనీలు వాటిలో పెట్టుబడులను తగ్గించుకోవడం కొసమెరుపు. వీటిలో 
రిలయన్స్ నిప్పన్, HDFC AMC, అవాస్ ఫైనాన్షియర్స్,  డాక్టర్ లాల్, ఇన్ఫో ఎడ్జ్ , PI ఇండస్ట్రీస్ , HDFC లైఫ్ ఇన్స్యూరెన్స్ , బాటా ఇండియా , సీమెన్స్ వంటివి ఉన్నాయి. 


Disclaimer: పైన పేర్కొన్న వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. 'BUY', 'CELL' రికమెండేషన్స్ కోసం కాదని మనవి.