సుజుకి ఎలక్ట్రిక్ బైక్స్ రాబోతున్నాయోచ్ !

సుజుకి ఎలక్ట్రిక్ బైక్స్ రాబోతున్నాయోచ్ !

ప్రముఖ మోటార్ దిగ్గజం సుజుకీ మోటర్ సైకిల్ నుండి మరిన్ని సరికొత్త మోడల్స్ రానున్నాయి. ఇందులో భాగంగా సుజుకీ ప్రోటో టైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది 2020 నాటికి అందుబాటులోకి రానుందని, ఇప్పటికే ఈ వెహికిల్‌ పరిక్షలు మొదలయ్యాయని సుజుకీ సంస్థ పేర్కొంది. కాగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధాన సమస్య ఛార్జింగ్. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం నుండి హామీ రావడంతో పలు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EVs)ను తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో 5వ అతిపెద్ద టూవీలర్స్ తయారీ సంస్థ అయిన సుజుకీ తన సోదర సంస్థ అయిన మారుతీ సుజుకీతో కలిసి వ్యాపార విస్తరణకు ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే సంవత్సరం కల్లా ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రోడ్లమీదకు తీసుకు రానున్నామని, ఇది భారత దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేయబడిందని సుజుకీ మేనేజింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సతోషీ ఉచిడా పేర్కొన్నారు. సుజుకీ మోటర్ సైకిళ్ళలో వాడినట్టే ఈ EVలోనూ సుజుకీ టయోటా టెక్నాలజీని వాడనున్నట్టు సంస్థ పేర్కొంది. టచ్ పాయింట్లు, ఛార్జింగ్ పాయింట్ల కోసం మారుతీ సుజుకీతో కలిసి పనిచేయనున్నట్టు సుజుకీ జనరల్ మేనేజర్ అంటున్నారు. ఎందుకంటే మారుతీ సుజుకీ కి పెద్ద నెట్‌వర్క్ ఉంది. సర్వీసింగ్ పాయింట్లు, ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువగా ఉండటం ఈ ఎలక్ట్రిక్ వాహనానికి కలిసొచ్చే అంశంగా సుజుకీ భావిస్తుంది. 

Image result for suzuki electric scooter
ఇప్పటికే భారత దేశంలో చిన్న ఎలక్ట్రిక్ కార్లపై సుజుకీ టయోటా కలిసి పనిచేస్తున్నాయి. ఈ కార్లు 2020లో మార్కెట్లోకి రానున్నాయి. భారత దేశంలో సుజుకీ కంపెనీ లీథియం అయాన్ బ్యాటరీల ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయనుంది. దీంతో ఈ EV టెక్నాలజీ, బ్యాటరీలను సుజుకీ మోటర్ సైకిళ్ళతో పంచుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఇది కలిసి వచ్చే అంశం. 
కొన్ని వారాల క్రితం దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో కూడా తన ఎలక్ట్రిక్ మోడల్ చేతక్‌ను ప్రదర్శించింది. ఇప్పటికే అమ్మకాలు లేక వెల వెల బోతున్న ద్విచక్ర వాహన రంగం ఈ ఎలక్ట్రిక్ వాహానాల మోడల్స్ తో పునరుజ్జీవనం లభించినట్టేనని మోటార్ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.  
మొదటి తరం ఎలక్ట్రిక్ వెహికిల్స్ సక్సెస్ కాకపోయినా.. అందులోని వైఫల్యాలను మేం చక్కదిద్దగలం అని సుజుకీ సంస్థ అంటుంది. మూడో తరం EVలు మాత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతాయన్న విశ్వాసాన్ని సుజుకీ ఇండియా వ్యక్తం చేసింది.