రుపీ ర్యాలీకి బ్రేక్‌-71 దిగువకు

రుపీ ర్యాలీకి బ్రేక్‌-71 దిగువకు

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ సాధిస్తున్న మూడు రోజుల వరుస ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 28 పైసలు కోల్పోయి 70.97 వద్ద ముగిసింది. ఈ బాటలో మరోసారి నీరసంగా ప్రారంభమైంది. 8 పైసలు తక్కువగా 71.05 వద్ద ప్రారంభమైంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 71 మార్క్‌ దిగువకు రుపీ చేరింది. ప్రస్తుతం 71.07 వద్ద ట్రేడవుతోంది. గత వారాంతాన 11 పైసలు పుంజుకున్న రూపాయి సోమవారం 4 పైసలు, మంగళవారం 8 పైసలు చొప్పున లాభపడింది. ఫలితంగా డాలరుతో మారకంలో మంగళవారం ఐదు వారాల గరిష్టం 70.69 వద్ద నిలిచింది. 

నేలచూపులో
డాలరుతో మారకంలో రూపాయి 2018లో 9 శాతం క్షీణించగా.. ఈ ఏడాది(2019) ఇప్పటివరకూ 4 శాతం తిరోగమించింది. ఫలితంగా ఈ సెప్టెంబర్‌ 3న 72.40 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే తదుపరి రూపాయి జోరందుకుని 2 శాతం పుంజుకుంది. ఇందుకు వర్ధమాన దేశాల కరెన్సీలు బలపడటం, దేశీ కేపిటల్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు, ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలు దోహదపడినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.