గోల్డ్ ఫ్యూచర్స్ ! టార్గెట్ రూ. 38,500 అంటున్న ఎక్స్‌పర్ట్స్ ...!

గోల్డ్ ఫ్యూచర్స్ ! టార్గెట్ రూ. 38,500 అంటున్న ఎక్స్‌పర్ట్స్ ...!

అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం డాలర్‌ను బలపరిచింది. ఈ నేపథ్యంలో నవంబర్ 5న ఆరంభ ట్రేడింగ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ పడిపోయాయి. అలాగే గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ నెగిటివ్ బయాస్‌తో 10 గ్రాముల బంగారం రూ. 38,375 వద్ద ట్రేడ్ అవుతోంది. US డాలర్ పెరుగదలతో గోల్డ్ రేట్స్‌లో కాస్త కదలిక మొదలైందని మెటల్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. ఇక దేశీయ మార్కెట్లో MCX మీద 38,300 చూపిస్తుండగా, బయ్యర్స్ హోల్డ్ చెయోచ్చని, టార్గెట్ రూ. 38,500 గా పేర్కొంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రికవరీతో గోల్డ్ , సిల్వర్ ధరలు లాభదాయకంగా మారాయి.  గ్లోబల్ మార్కెట్లలో ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 1,510 డాలర్ల వద్ద, ట్రాయ్ ఔన్స్ వెండి ధర 18.06 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయ మార్కెట్లలో గోల్డ్ 10 గ్రాములు ధర రూ. 38,450 వద్ద, వెండి కేజీ రూ. 46,600 వద్ద ముగిసాయి. ఈ రెండు లోహాల కీలక నిరోధ స్థాయిలు వరుసగా 38,500, 46,800 వద్ద ఉన్నాయని ఇండియన్ నీవేష్ కమోడిటీస్  పేర్కొంది. 
నిపుణుల సలహాల మేరకు బంగారాన్ని 38,300 వద్ద కొనుగోలు చేయోచ్చని, స్టాప్ లాస్ 38,180గా, టార్గెట్ ప్రైస్ రూ. 38,500గా పేర్కొంటున్నారు. ఇక వెండి విషయానికి వస్తే.. రూ.46,400 వద్ద కొనుగోలు, స్టాప్ లాస్ రూ.46,200, టార్గెట్ ప్రైస్ రూ. 46,800 గా ఎనలిస్టులు సూచిస్తున్నారు. మార్కెట్లలోని డైలీ ఛార్టుల్లో ట్రేడింగ్ లెవల్ రూ. 38,176 వద్ద 20 డేస్ EMA లో స్వల్ప లాభాలు కనబడతున్నాయి. అలాగే కొంచెం అప్‌ట్రెండ్ కూడా ఈ ఛార్టుల్లో కనబడుతుంది. 50 డేస్ EMA ప్రకారం చూస్తే.. కీలక మద్దతు రూ. 37,850 వద్ద కనబడుతుంది. MACD ఛార్టుల్లో గత కొద్ది సెషన్స్ లో ఫ్లాట్ పాజిటివ్ ట్రెండ్ కనబడుతుండటం గమనార్హం. 38,600-38,850 వద్ద బంగారం ధరలు కదలాడొచ్చన్నది గోల్డ్ ట్రేడర్స్ అంచనాగా ఉంది. ఇదే MACD ఛార్టుల్లో వెండి కూడా రూ. 44,600-45,000 మధ్య డిమాండ్ జోన్‌ కనబడుతుంది.  

Disclaimer: పైన పేర్కొన్న వివరాలు స్టాక్ ఎనలిస్టులు, బ్రోకింగ్ కంపెనీలచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.
 tv5awards