అస్సలు రిస్క్ తీసుకోలేని ఇన్వెస్టర్లకు బెస్ట్ ఫండ్స్

అస్సలు రిస్క్ తీసుకోలేని ఇన్వెస్టర్లకు బెస్ట్ ఫండ్స్


ఫండ్ మేనేజర్ లేకుండా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించాలని భావించే ఇన్వెస్టర్‌లు.. ఇండెక్స్ ఫండ్‌లను తప్పక పరిశీలించాలి. ఔట్‌పెర్ఫామ్ చేయగల ఫండ్‌లను ఎంపిక చేయడంలో ఫండ్ మేనేజర్‌ల సామర్ధ్యంపై తలెత్తుతున్న సందేహాల కారణంగా, ఇన్వెస్టర్‌లు అతి తక్కువగా మేనేజ్ చేసే ఫండ్స్ అయిన ఇండెక్స్ మరియు ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా లార్జ్-క్యాప్ ఫండ్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.


ఇండెక్స్ ఫండ్‌లకు ఉన్న మరో ప్రయోజనం వాటి తక్కువ ఖర్చులే. యాక్టివ్‌గా మేనేజ్ చేసే ఫండ్‌తో పోల్చితో 0.5 నుంచి 1.5 శాతం వరకు ఏటా ఇండెక్స్‌ ఫండ్‌తో ఇన్వెస్టర్లు ఆదా చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలానికి పరిగణిస్తే, ఈ ఖర్చులపై ఆదా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏదైనా ఒక స్టాక్ లేదా ఒక పరిశ్రమ లేదా ఒక సెక్టార్‌పై ఆధారపడి ధరలలో మార్పు రావడం కాకుండా, ఇండెక్స్‌ల విస్తృత పరిధిపై ఇండెక్స్ ఫండ్స్ ఆధారపడి ఉంటాయి. డీమ్యాట్ ఖాతా నిర్వహణ, అతి తక్కువ లిక్విడిటీల కారణంగా ఈటీఎఫ్‌లతో పోల్చితే ఇండెక్స్ ఫండ్‌లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

అతి తక్కువ ట్రాకింగ్ ఎర్రర్‌తో, ఆయా సూచీలకు నకళ్లుగా ఇండెక్స్ ఫండ్స్ ప్రవర్తిస్తాయి. యాక్టివ్ ఫండ్ నిర్వహణ ఏదీ లేకపోవడంతో, ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఈ నిష్పత్తి సహజంగానే ఇన్వెస్టర్‌కు బదలాయించడం జరుగుతుంది. తమ క్లయింట్‌లకు వెల్త్ అడ్వైజర్‌లు సూచిస్తున్న కొన్ని ఇండెక్స్ ఫండ్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం:

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్
ఖర్చు నిష్పత్తి: 0.10%
నిర్వహణలో ఉన్న ఆస్తులు: రూ. 436 కోట్లు
టాప్ 5 హోల్డింగ్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్
1 ఏడాది/3 ఏళ్ల రాబడి (%): 15.82/12.83

మొదటిసారి పెట్టుబడి చేసేవారికి అర్ధం చేసుకునేందుకు ఇది అత్యంత సులభతరమైన ఫండ్ అని అనేక మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ చెబుతారు. నిఫ్టీ-50 ఇండెక్స్‌లో 50 స్టాక్స్ ఉండగా, మార్కెట్ ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలైజేషన్, లిక్విడిటీ, ఇతర ప్రమాణాల ప్రకారం ఫిల్టర్ చేయవచ్చు. అలా చేస్తే నిఫ్టీలో ఫైనాన్షియల్ విభాగానికి 39.39 శాతం ఎక్స్‌పోజర్ ఉంది. మార్కెట్ ఎక్స్‌పోజర్ ప్రకారం రాబడులు కోరుకుంటూ, ఫండ్ మేనేజర్‌ను వద్దనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనుకూలం. ఐదు సంవత్సరాలకు పైగా కాల పరిమితితో పెట్టుబడి చేసేవారు, సిప్ విధానంలో దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

 

మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్
ఖర్చు నిష్పత్తి: 0.38%
నిర్వహణలో ఉన్న ఆస్తులు: రూ. 18 కోట్లు
టాప్ 5 హోల్డింగ్స్: ఫెడరల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, వోల్టాస్, ఇన్ఫో ఎడ్జ్, ఆర్‌బీఎల్ బ్యాంక్
1 ఏడాది/3 ఏళ్ల రాబడి (%): NA
మిడ్‌క్యాప్ స్పేస్‌లో ఈ మధ్యనే విడుదల అయిన ఈ ఫండ్‌కు, ఇప్పటికి ట్రాక్ రికార్డ్ ప్రకారం పెర్ఫామెన్స్ చూసే అవకాశం లేదు. లిక్విడిటీ తక్కువగా ఉండడంతో, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్‌ను లాంఛ్ చేయడానికి ఫండ్ హౌస్‌లు ముందుకు రావడం లేదు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా మిడ్ క్యాప్ ఫండ్స్ అండర్‌పెర్ఫామ్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ తమ పోర్ట్ ఫోలియోలో ఉండాలని కోరుకునే వారు దీనిని ప్రయత్నించవచ్చు

 

మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 FOF
ఖర్చు నిష్పత్తి: 0.10 %
నిర్వహణలో ఉన్న ఆస్తులు: రూ. 88 కోట్లు
టాప్ 5 హోల్డింగ్స్: మైక్రోసాఫ్ట్ కార్ప్, యాపిల్, అమెజాన్.కామ్, ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్ సి క్లాస్
1 ఏడాది/3 ఏళ్ల రాబడి (%): 11.37/20.07
అధిక రిస్క్‌ను తీసుకునే వారి కోసం ఈ ఫండ్. దీని పోర్ట్‌ఫోలియోలో ప్రాథమికంగా నాస్‌డాక్‌లో లిస్ట్ అయి యూఎస్-కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్నాలజీ దిగ్గజాలు ఉంటాయి. ఇలా జెయింట్ స్థాయిలో భారత్‌కు చెందిన కంపెనీలతో ఫండ్‌ను ఏర్పాటు చేయడం కష్టతరం అని ఫైనాన్షియల్ ప్లానర్స్ చెబుతారు.

 

యూటీఐ నిఫ్టీ నెక్ట్స్ 50
ఖర్చు నిష్పత్తి: 0.27 %
నిర్వహణలో ఉన్న ఆస్తులు: రూ. 487 కోట్లు
టాప్ 5 హోల్డింగ్స్: ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, గోద్రెజ్ కన్జూమర్, డాబర్, శ్రీ సిమెంట్
1 ఏడాది/3 ఏళ్ల రాబడి (%): 8.4/NA
నిఫ్టీ 50 ఇండెక్స్‌తో పోల్చితే నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీ... కంపెనీలు, సెక్టార్‌ల పరంగా వైవిధ్యత కలిగిన పోర్ట్‌ఫోలియో అని ఎనలిస్ట్‌లు చెబుతారు. ఈ ఇండెక్స్‌లో నాలుగు బీమా కంపెనీలు ఉంటాయి. నిఫ్టీ 50 పోర్ట్‌ఫోలియో యొక్క 59.67%ను నిఫ్టీ నెక్ట్స్ 50లోని టాప్ 10 స్టాక్స్ కలిగి ఉంటాయి. అధిక డైవర్సిఫికేషన్ కోరుకునేవారికి ఇది తప్పనిసరిగా పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన ఫండ్.tv5awards