హోటల్ స్టాక్స్‌లో మళ్లీ ఉత్సాహం రాబోతోందా ?

హోటల్ స్టాక్స్‌లో మళ్లీ ఉత్సాహం రాబోతోందా ?

భారతీయ ఈక్విటీ సూచికలలో ఇటీవల ర్యాలీ ఉన్నప్పటికీ, హోటల్ కంపెనీల స్టాక్స్ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అక్టోబర్లో, ప్రముఖ చైన్ హోటల్స్ కంపెనీ అయిన  ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, EIH లిమిటెడ్, తాజ్ GVK  హోటల్స్ లిమిటెడ్ మరియు హోటల్ లీలా వెంచర్స్ లిమిటెడ్, లెమన్ ట్రీ హోటల్స్ లిమిటెడ్ వంటి స్టాక్స్  8-10% వరకూ తగ్గాయి. 

Related image
అయితే ఫండమెంటల్స్ ఇప్పుడు అనుకూలంగా మారుతున్నాయి. హోటళ్ళకు డిమాండ్-సరఫరా సమీకరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వ సంస్కరణలు మరియు నిర్మాణాత్మక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ రేట్ల (OR) కంటే ముందు ముందు మరింతగా ఆక్యుపెన్సీని పెంచడానికి ప్రభుత్వ సవరణలను హోటెల్ కంపెనీలు కోరుతున్నాయి. వీటి డిమాండ్ల పట్ల ప్రభుత్వం కూడా సానుకూల ధృక్ఫథంతో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పర్యాటక రంగం నుండి విదేశీ మారక ద్రవ్యం రానుండటంతో ప్రభుత్వం హోటెల్స్ ఆక్యుపెన్సీకి అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోనున్నట్టు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 

Image result for Indian Hotel girls welcome
హోటెల్స్ రంగానికి సంబంధించి ICICI డైరెక్ట్ నిర్వహించిన ఓ సర్వేలో  సగటు ఆక్యుపెన్షీ రేషియో 2019 ఆర్ధిక సంవత్సరానికి గానూ 67.5శాతంగా ఉందని, ఇది రానున్న 2023 ఆర్ధిక సంవత్సరం నాటికి 73శాతంగా పెరగచ్చని అంచనా వేసింది. రూమ్స్ సప్లయ్ డిమాండ్ రానున్న 5 సంవత్సరాల్లో 5శాతం పెరగొచ్చని, ఎక్స్‌పాన్షన్ కూడా 6.7శాతం ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Image result for leela resorts
ఇక ప్రభుత్వం కూడా హోటెల్ రూమ్స్ బుక్ చేసుకునే మొత్తంపై జీఎస్టీని తగ్గించింది. రూమ్‌ బుకింగ్ మీద గతంలో జీఎస్టీ 28శాతం ఉండేది. ఇప్పుడు దాన్ని 18శాతం చేయడంతో హోటెల్స్ రంగానికి కాస్త ఊరట లభించినట్టైంది.  ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే.. మన దేశం టూరిస్టులకు మరింత ఆకర్షణీయంగా మారింది. 
రాబోయే పర్యాటక కాలం అంటే.. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ హోటల్స్ ఆదాయంలో పునరుజ్జీవనం కనిపించవచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. కేర్ రేటింగ్స్ నివేదిక మేరకు హోటల్స్ రేట్ల వృద్ధి 3.5 శాతం నుండి 4.5శాతం వరకూ ఉండొచ్చని అంచనా వేసింది. దీని ప్రకారం రాబోయే మూడేళ్ళలో హోటల్ రెవిన్యూ 10-12 శాతం CAGR చొప్పున పెరుగుతుందని భావిస్తున్నారు. హోటల్స్ కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ కాస్త నిరుత్సాహ పరిచినా.. మరుసటి త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో గదుల సరఫరా 5శాతం పెరుగుతోందని, డిమాండ్ 6.7శాతం విస్తరణతో పోలిస్తే.. మరింత మెరుగైన ఫలితాలు హోటల్ రంగంలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. హోటళ్ళకు డిమాండ్ సరఫరా సమీకరణాన్ని మెరుగు పరచడానికి ప్రభుత్వ సంస్కరణలు మరియు నిర్మాణాత్మక మార్పులు రానున్నాయని హోటల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.