ఐపీఓకు రానున్న బర్గర్‌ కింగ్‌

ఐపీఓకు రానున్న బర్గర్‌ కింగ్‌

ప్రముఖ దేశీయ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌(QSR) బర్గర్‌ కింగ్ ఇండియా ఐపీఓకు రాబోతోంది. ఐపీఓకు సంబంధించి ఈవారంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ సమర్పించనుంది. ఐపీఓ ద్వారా సమీకరించే రూ.1000 కోట్ల నిధులను కంపెనీ విస్తరణ కోసం వినియోగించనుంది. కంపెనీ ప్రాస్పెక్టస్‌ సమర్పించిన తర్వాత ఐపీఓకు వచ్చేందుకు 4-6 వారాల్లో సెబీ అనుమతులు ఇస్తుంది. సెబీ నుంచి రెగ్యులేటరీ అనుమతులు వస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐపీఓకు రావాలని కంపెనీ భావిస్తోంది.  

ప్రత్యర్థి కంపెనీలైన జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌కు గట్టిపోటీనిస్తూ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచేందుకు బర్గర్‌ కింగ్  ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఇండియా, ఇండోనేషియా దేశాల్లో రెస్టారెంట్లను కలిగివున్న ఈసంస్థ ఇతర దేశాలకు విస్తరించాలని యోచిస్తోంది. ఈ ఐపీఓకు ఎడెల్‌వీజ్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌, సీఎల్‌ఎస్‌ఏలు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్స్‌గా ఉన్నాయి.