మ్యూచువల్ ఫండ్స్ ముచ్చటపడి మరీ కొంటున్న 7 స్టాక్స్ ఇవే..!

మ్యూచువల్ ఫండ్స్ ముచ్చటపడి మరీ కొంటున్న 7 స్టాక్స్ ఇవే..!

గత సంవత్సర కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు రాబడిని కనబరుస్తున్నాయి. BSE సెన్సెక్స్ ఈ సంవత్సరంలో దాదాపు 20శాతం పెరిగింది. ఫ్రంట్‌లైన్ సూచీల్లో పెరుగుదల కనబడినా కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ మాత్రమే నష్టాల బాటన నడిచాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 5శాతం వృద్ధిని కనబరిచింది. బ్లూచిప్ షేర్లు అస్థిరంగా కదలాడినా.. , మార్కెట్లు ఆటుపోట్లకు గురైనా మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులు మాత్రం నిశబ్దంగా కొన్ని ఎంచుకున్న షేర్లను తమ పోర్ట్ ఫోలియోల్లో చేర్చారు. వారు ఎంచుకున్న షేర్లలో ఓ 7 స్టాక్స్ గత నాలుగు త్రైమాసికాలుగా వృద్ధిని కొనసాగిస్తూనే వచ్చాయి. ఎకనామిక్ టైమ్స్ జరిపిన ఓ సర్వేలో MF కంపెనీలు హోల్డ్ చేసిన ఈ 7 స్టాక్స్ అప్రతిహతంగా రిటర్న్స్ ను అందిస్తూ వచ్చాయి. దీర్ఘకాలికంగా లాభాలు రావొచ్చన్న అంచనాతో ఫండ్ మేనేజర్లు స్టాక్స్ మీద పెట్టుబడి పెడతారు. పూర్తి క్రమశిక్షణతో , స్టాక్స్‌ను , హోల్డింగ్స్‌ను ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోడంతోనే లాభాలు వస్తాయని ఫండ్ మేనేజర్లు అంటున్నారు. ఒక స్టాక్ క్షీణతకు లోనయినప్పుడు వెంటనే దాని ప్రత్యామ్నాయాన్ని వెతకాల్సిందే అంటున్నారు ఫండ్ మేనేజర్లు . మరి వారు పెట్టుబడి పెట్టిన ఆ 7 స్టాక్స్ ఎంటో మనమూ చూద్దాం. 
1. క్యుమిన్స్ ఇండియా 
ఈ కంపెనీ ఆర్ధిక స్థితి ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా స్ట్రాంగ్ డిమాండ్ కలిగి ఉంది. కరెంట్ ప్రైస్ రూ. 546 , PE 22.2 శాతం గా ఉంది. కుమ్మిన్స్ ఇండియా స్టాక్‌పై ఎనలిస్టులు ఇచ్చిన రికమెండేషన్స్‌ ఇలా ఉన్నాయి. Buy-15, Hold-11, Sell-9. ఈ స్టాక్స్ ను హోల్డ్ చేసిన టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లో ICICI ప్రుడెన్షియల్ డివిడెంట్ ఈల్డ్ ఈక్విటీ, యాక్సిస్ గ్రోత్ , ICICI ప్రుడెన్షియల్ మాన్యుఫ్యాక్చర్ ఇండియా, సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్, సహారా పవర్ &నేచురల్ రిసోర్సెస్  ఉన్నాయి. 
.............................

2. TVS మోటార్స్ 
టీవీఎస్ మోటార్స్ మంచి బ్రాండ్ పవర్‌ను కలిగి ఉండటం కలిసొచ్చే అంశం. కాస్ట్ ఎఫీషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడంతో టూవీలర్స్ అమ్మకాలు పడిపోతున్నా ..నిలదొక్కుకోగలిగింది. కొత్త ఉత్పత్తులను లాంఛ్ చేయనుండటం, కంపెనీ వ్యాపారాల్లో బ్రాండ్ విలువ కలిగి ఉండటంతో ఈ స్టాక్స్ మీద మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు నమ్మకాన్ని పెంచుకున్నారు.  ఈ స్టాక్ కరెంట్ ప్రైస్ రూ. 459, PE 30.7 గా ఉంది. ఎనలిస్టుల రికమెండేషన్స్  ప్రకారం  Buy - 12, Hold - 9, Sell-32. టీవీఎస్ మోటార్స్ స్టాక్స్ ను హోల్డ్ చేస్తున్న వాటిలో ... ICICI ప్రుడెన్సియల్ భారత్ కన్సంప్షన్ , IDBI ఈక్విటీ అడ్వాంటేజ్ , నిప్పన్ ఇండాయ ట్యాక్స్ సేవర్, IDFC ఫోకస్ ఈక్విటీ, సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి.  
.......................

3. లార్సెన్ &టుబ్రో
ప్రతి కూల పరిస్థితుల్లోనూ నిశబ్దంగా తన పని తాను చేసుకుంటూ లాభాలను ఆర్జిస్తూ వస్తోంది ఇంజనీరింగ్ దిగ్గజం L&T. తన చేతిలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తూ వస్తున్న ఈ కంపెనీ షేర్లు మ్యూచువల్ ఫండ్ కంపెనీలను ఆకర్షిస్తూనే ఉంది. ప్రస్తుత ధర రూ. 1,432, PE 21.2 గా నమోదు అయింది. ఈ స్టాక్స్ మీద ఎనలిస్టుల రికమెండేషన్స్ Buy-35, Hold-2, Sell-2 గా ఉన్నాయి.  L&T స్టాక్స్ ను హోల్డ్ చేస్తున్న టాప్ 5 మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో టాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ , SBI ఇన్ఫ్రా, టారస్ ఇన్ఫ్రా, నిప్పన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా, క్వాంట్ ఇన్ఫ్రాలు ఉన్నాయి. 
.................................

4. కోరమాండల్ ఇంటర్నేషనల్ 
ఫెర్టిలైజర్స్ తయారీ కంపెనీ అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ రుతుపవనాలు బాగుండి వ్యవసాయ దిగుబడులు పెరిగితే.. ఈ స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయన్న నమ్మకాన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ బాగుండటంతో ఈ స్టాక్స్ పుంజుకున్నాయి. ప్రస్తుత ధర రూ. 470, PE 16.6 గా ఉంది. ఎనలిస్టుల రికమెండేషన్స్ ప్రకారం Buy-13, Hold-1, Sell-0 గా ఉన్నాయి. ఈ స్టాక్‌ను హోల్డ్ చేస్తున్న MF కంపెనీల్లో DSP ఫోకస్, టాటా రిసోర్సెస్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్, SBI మాగ్నమ్ మిడ్ క్యాప్ లు ఉన్నాయి. 
..........................

5. KNR కన్‌స్ట్రక్షన్స్ 
రోడ్ కన్‌స్ట్రక్షన్స్ లో దిగ్గజ సంస్థ అయిన KNR కన్‌స్ట్రక్షన్స్ స్ట్రాంగ్ రెప్యూటేషన్ కలిగి ఉంది. చేతిలో కూడా మంచి కాంట్రాక్టులు ఉండటంతో ఈ షేర్ ఆకర్షణీయంగా మారింది. తన ఆర్డర్ బుక్‌లో రూ. 6,500 కోట్ల ఆర్డర్లు ఉండగా మరికొన్ని ఫైనల్ కావాల్సి ఉంది. ప్రస్తుత ధర రూ. 225, PE 13.4 గా ఉంది. ఎనలిస్టుల రికమెండేషన్స్ ప్రకారం Buy-25, Hold-1 , Sell-0 గా ఉన్నాయి. KNR కన్‌స్ట్రక్షన్స్ ను హోల్డ్ చేస్తున్న MF కంపెనీల్లో టాటా ఇన్ఫ్రా, LIC MF ఇన్ఫ్రా, ICICI ప్రుడెన్షియల్ ఇన్ఫ్రా, యూనియన్ స్మాల్ క్యాప్, L&T బిజినెస్ సైకిల్ వంటివి ఉన్నాయి. 
......................

6. ITC 
సిగరెట్లు, FMCG దిగ్గజమైన ITC స్థిరంగా రాణిస్తూ వస్తోంది. గత కొన్ని క్వార్టర్లుగా ఆరోగ్యకరమైన లాభాలను ప్రకటిస్తూ వస్తున్న సంస్థ ITC . దీని ప్రస్తుత ధర రూ. 249, PE 23.9గా ఉంది. ఎనలిస్టుల రికమెండేషన్స్ ప్రకారం Buy-34, Hold-4, Sell-0 గా ఉన్నాయి. ITC స్టాక్స్ ను హోల్డ్ చేస్తున్న MF కంపెనీల్లో ICICI ప్రుడెన్షియల్ FMCG, టాటా ఇండియా కన్జ్యూమర్ , నిప్పన్ ఇండియా కన్జంప్షన్, ICICI ప్రుడెన్షియల్ డివిడెంట్ ఈక్విటీ, ICICI ప్రుడెన్షియల్ ఫోకస్డ్‌ ఈక్విటీలు ఉన్నాయి. 
........................

7. సుందరం ఫాస్ట్‌నర్స్ 
అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేయడం, వైవిధ్య భరిత వ్యాపార విధానాలు సుందరం ఫాస్టనర్స్ ను అగ్రపథంలో నిలిపాయి. ఆటో మోబైల్ రంగం మందగమనంలో ఉన్నా ఉపకరణాల విభాగంలో సరికొత్త వ్యూహాలను సుందరం ఫాస్టనర్స్ అవలంబిస్తోంది. టీవీఎస్ గ్రూప్ ఆఫ్‌ కంపెనీల్లో ఒకటైన సుందరం ఫాస్ట్నర్ ప్రస్తుత ధర రూ. 471, PE 23.5 గా ఉంది. ఎనలిస్టుల రికమెండేషన్స్ ప్రకారం Buy-3, Hold-1, Sell-0 గా ఉన్నాయి. ఈ స్టాక్స్ ను హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో టాటా ఇన్ఫ్రా, SBI ఇన్ఫ్రా, టారస్ ఇన్ఫ్రా, నిప్పన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా, క్వాంట్ ఇన్ఫ్రా లు ఉన్నాయి. 
(All data relating to mutual fund holdings as on 30 Sep; stock prices as on 24 Oct. Source: Capitaline)

Disclaimer: పైన పేర్కొన్న వివరాలు ఎనలిస్టులు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.