WTOలో చైనా విజయం ! USపై రూ.25 వేల కోట్ల నష్టపరిహారం

WTOలో చైనా విజయం ! USపై రూ.25 వేల కోట్ల నష్టపరిహారం

అమెరికా - చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య సంక్షోభంలో మొదటి అడుగు చైనాకే అనుకూలంగా పడింది. అమెరికా నుంచి చైనా సుమారు రూ.25 వేల కోట్లు రాబట్టుకోవచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఓ) వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ముదురుతున్న ఈ వ్యవహారం నేపధ్యంలో చైనాకు ఇది అనుకూలమైన విషయం. 

జెనీవా హెడ్ క్వార్టర్స్ నుంచి విడుదలైన వివరాల ప్రకారం ఇంతవరకూ డబ్లుటీఓ చరిత్రలో ఎప్పుడూ విధించని విధంగా భారీ స్థాయిలో నష్టపరిహారాన్ని విధించారు. యూఎస్ విధించిన యాంటీ డంపింగ్ డ్యూటీస్ మరీ ఇబ్బందికరంగా ఉన్నాయని, ఇది వాణిజ్యాన్ని అడ్డుకోవడమేనంటూ చైనా నష్టపరిహారాన్ని కోరింది. అయితే చైనా కోరిన మొత్తంలో సుమారు అర శాతానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదం తెలిపింది. అయితే ఇలాంటి వ్యవహరాలు కోర్టు వెలుపల పరిష్కారానికే అధిక శాతం మొగ్గుచూపుతారు. 

అయితే ఈ తీర్పు నేపధ్యంలో చైనా దేశం.. అమెరికా నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకూ నష్టపరిహారాన్ని కోరే ఆస్కారం లభిస్తుంది. ఏడాదిన్నర క్రితం మొదలైన ఈ వ్యవహారం నేపధ్యంలో ఇరు దేశాలు సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై పరస్పరం అధిక పన్నులు విధించుకున్నాయి. 

డ్రాగన్‌ను శాసించేందుకే..
చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధించింది. అనేక అధిక పన్నులు వేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉక్కుపై యాంటీ డంపింగ్ డ్యూటీలను విపరీతంగా పెంచింది. వీటికి తోడు చైనా నుంచి దిగుమతయ్యే అనేక వస్తువులపై కూడా సుంకాలను పెంచారు. ఈ నేపధ్యంలో చైనా కూడా వెనక్కి తగ్గలేదు. వాళ్లూ అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు పెంచారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ వాణిజ్య యుద్ధం అనేక ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. 
భారత్, వియత్నాం వంటి దేశాలకు ఇది మంచి తరుణమే అయినా ఈ వాణిజ్య యుద్ధం ఎలా మలుపులు తిరుగుతుందో ఊహించడం కష్టంగా ఉంది. 

ట్రంప్ వింటాడా
ప్రస్తుతానికైతే ఇది అమెరికా దేశానికి ఇది నెగిటివ్ న్యూస్. డబ్లుటిఓ ఆదేశాల నేపధ్యంలో చైనా చేతిలో ఓ న్యాయపరమైన అస్త్రం కూడా దొరికింది. మరి ట్రంప్ డబ్లుటిఓ మాటలను లెక్క చేస్తారా.. లేదా అనేది కూడా అనుమానమే. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');