నవంబర్ సిరీస్ ఎలా ఉండబోతోంది ?

నవంబర్ సిరీస్ ఎలా ఉండబోతోంది ?

షార్ట్ టర్మ్ ట్రేడర్లు ట్రెండ్ పట్టుకోవడం ఇప్పుడు కష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఈ గరిష్ట స్థాయిల దగ్గర నిఫ్టీపైకి వెళ్తుందా లేక రెసిస్టెన్స్ ఎదుర్కొని కిందికి దిగి వస్తుందా అనే అంశంపై క్లారిటీ కష్టంగా ఉంది. అయితే టెక్నికల్ ఛార్టిస్ట్ అంచనా ప్రకారం వచ్చే వారం నిఫ్టీ 12,103 పాయింట్ల మార్కును ఓ సారి టెస్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో కూడా నిఫ్టీ తన లైఫ్ టైం మార్క్ 12103.05ను జూన్ 2019లో క్రాస్ చేసినప్పటి నుంచి  ఒడిదుడుకులకు గురవుతూనే ఉంది. 
అయితే ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రేడర్లకు కొద్దిగా రిస్కీ అని సూచిస్తున్నారు టెక్నిక్విటీ ఇన్వెస్టింగ్ కో ఫౌండర్ కులకర్ణి. ఆయన అంచనా ప్రకారం నిఫ్టీ ఈ స్థాయిల దగ్గర నుంచి కొద్దిగా పైకి వెళ్లి గత గరిష్ట స్థాయిలను ఓ సారి పరీక్షించవచ్చు. 
అయితే నిఫ్టీ 11,985 పాయింట్ల పైన నిలబడలేకపోతే మాత్రం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే ఆస్కారం ఉంది. 

ఆటో ప్యాక్ ఎలా ఉండబోతోంది, బాటమ్ అవుట్ అయిపోయిందని అనుకోవచ్చా ?
నెలవారీ కార్ల అమ్మకాలను ఓ సారి పరిశీలిస్తే.. ఇప్పటికీ ఆ మార్క్ 2 లక్షల లోపే ఉంది. గతంలో 2012,2014,2016 సంవత్సరాల్లో కొన్ని నెలల్లో మాత్రం ఇలా నెలకు 2 లక్షల లోపు కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి కనిష్ట స్థాయిలు నమోదవుతున్నాయి. 
ఇక్కడ లిక్విడిటీ, బీఎస్ 6 వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం జనాల ఎదురుచూపు వంటి అనేక అంశాలు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో బాటమ్ అవుట్ అయిపోయిందని ఓ నిర్ధారణకు రావడం కష్టం. అయితే ఇక్కడి నుంచి కొద్దిగా రికవరీ రావొచ్చని అర్థమవుతోంది అంటున్నారు కులకర్ణి. 

నవంబర్ సిరీస్ ఎలా ఉండబోతోంది 
నిఫ్టీ రోలోవర్స్ నవంబర్ సిరీస్‌కు 84.09 శాతంగా ఉంది. గత ఆరు నెలల యావరేజ్ 74.87 శాతంతో పోలిస్తే ఇది మెరుగ్గానే ఉంది. 
బ్యాంక్ నిఫ్టీ రోలోవర్స్ 63.59 శాతంగా ఉంది. అయితే ఇక్కడ విభిన్నంగా ఆరు నెలల కనిష్టం 73.22 శాతం. 
వీటిని బట్టి చూస్తే బుల్స్ ఈ నెలలో కూడా పటిష్టంగానే ఉండొచ్చనే అనిపిస్తోంది.