ఈ చిన్నషేర్లకు.. దూకుడెక్కువ!

ఈ చిన్నషేర్లకు.. దూకుడెక్కువ!

దివాలీ రోజు హుషారుగా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ల కొత్త ఏడాది దుమ్ము దులుపుతోంది. స్టాక్ బుల్‌ భారీ లాభాలతో కాలు దువ్వుతోంది. వెరసి సెన్సెక్స్‌ 40,345 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో నిఫ్టీ సైతం సరికొత్త రికార్డుకు చేరువైంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు మార్కెట్లను మించుతూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో డిష్‌ టీవీ ఇండియా లిమిటెడ్‌, థామస్‌ కుక్‌ ఇండియా లిమిటెడ్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

డిష్‌ టీవీ ఇండియా లిమిటెడ్‌: కేబుల్‌, డీటీహెచ్‌ సేవల రంగంలోని ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 18 శాతం దూసుకెళ్లింది. రూ. 12.60కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 19.22 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 17.35 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

థామస్‌ కుక్‌ ఇండియా లిమిటెడ్‌: ట్రావెల్‌, లీజర్‌ రంగ ఈ కంపెనీ షేరు కొనేవాళ్లు అధికమై ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లింది. రూ. 135 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 16,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.49 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 12 శాతం పెరిగింది. రూ. 24ను తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 68000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 3.66 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

హడ్కో లిమిటెడ్‌: ఫైనాన్షియల్‌ రంగ ఈ పీఎస్‌యూ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం పురోగమించింది. రూ. 42కు చేరింది. ఇంట్రాడేలో రూ. 44 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 88,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 7.07 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13 శాతం జంప్‌ చేసింది. రూ. 10ను తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 57500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 4.13 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.