మార్కెట్లలో దివాలీ ధమాకా

మార్కెట్లలో దివాలీ ధమాకా

దేశీ స్టాక్‌ మార్కెట్ల కొత్త ఏడాది (సంవత్‌ 2076) తొలి రోజు హుషారుగా ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దీపావళి రోజు నిర్వహించే ముహూరత్‌ ట్రేడింగ్‌లో ప్రధాన ఇండెక్సులు లాభాలతో మెరుస్తున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 246 పాయింట్లు జంప్‌చేసి 39,304 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 59 పాయింట్లు ఎగసి 11,643 వద్ద కదులుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ఇండెక్సులూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

టాటా మోటార్స్‌ స్పీడ్‌
నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 17 శాతం దూసుకెళ్లగా.. యస్‌ బ్యాంక్‌ 6 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో ఇన్ఫోసిస్‌, వేదాంతా, ఐటీసీ, ఐషర్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హీరో మోటో 2-1 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, ఎయిర్‌టెల్‌, టైటన్, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ, టీసీఎస్‌ 2-0.3 శాతం మధ్య క్షీణించాయి.

టాటా ఎలక్సీ అప్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 16 శాతం దూసుకెళ్లగా.. టాటా ఎలక్సీ, ఐడియా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, మదర్‌సన్ సుమీ, ఐబీ హౌసింగ్‌, ఎన్‌బీసీసీ, అశోక్‌ లేలాండ్ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు మారికో, యూబీఎల్‌, ఉజ్జీవన్‌, ఇండిగో, శ్రీరామ్‌ ట్రాన్స్‌, క్యాస్ట్రాల్‌ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి.

స్మాల్‌ క్యాప్స్‌ జోరు
మార్కెట్ల బాటలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ సైతం జోరందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.7 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1.25 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1445 లాభపడగా.. 407 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఆన్‌మొబైల్‌, సింప్లెక్స్‌, స్యూబెక్స్‌, ఫైజర్‌, సంఘ్వీ, కాంటబిల్‌, షీలా ఫోమ్‌, స్పైస్‌జెట్‌, గార్డెన్‌ రీచ్‌, ఎంఎస్‌టీసీ, విండ్‌సర్, జీ లెర్న్‌ తదితరాలు 14-5 శాతం మధ్య జంప్‌చేశాయి.