దివాలీ ముహూరత్‌ ట్రేడింగ్

దివాలీ ముహూరత్‌ ట్రేడింగ్

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఏడాది(సంవత్‌) 2076.. దీపావళి(లక్ష్మీ పూజ) నుంచీ ప్రారంభంకానుంది. దీంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీలు విక్రమ్‌ సంవత్‌ తొలి రోజు(27న) యథాప్రకారం ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఆదివారం సాయంత్రం గంటపాటు ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ప్రీట్రేడింగ్‌ సెషన్‌తో కలిపి 6.00కు మొదలై 7.15కు ముగియనుంది. అయితే సోమవారం బలిప్రతిపాద కారణంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు. దీంతో తిరిగి మంగళవారం(29న) నుంచీ సాధారణ ట్రేడింగ్ ప్రారంభంకానుంది. గత దీపావళి నుంచి ఈ దీపావళి వరకూ సంవత్‌ 2075లో సెన్సెక్స్‌, నిఫ్టీ సగటున 10 శాతం చొప్పున లాభపడటం విశేషం! అయితే మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 10 శాతం చొప్పున పతనంకావడం గమనార్హం!