భారత దేశంలో ఆటోమేషన్ లాభమా ? నష్టమా.??

భారత దేశంలో ఆటోమేషన్ లాభమా ? నష్టమా.??

ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు, రవాణ, వంటి వివిధ రంగాల్లో మిషన్స్ కీలక పాత్ర వహిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఖచ్చితత్వాన్ని పెంచేందుకు అన్ని కంపెనీలు, ప్రభుత్వాలు  ఆటోమేషన్‌ వైపు మళ్లుతున్నాయి. మరి ఆటో మేషన్ ప్రక్రియ మానవాళికి చేటు చేస్తుందా..? ఉపాధి కల్పన అవకాశాలు మృగ్యంగా మారిపోనున్నాయా..?
నేడు సమాజంలో మనుషులు నిర్వహిస్తున్న చాలా పనులను కంప్యూటర్లు నియంత్రిస్తున్నాయి. కంప్యూటింగ్ ద్వారా పూర్తి ఖచ్చితత్వం, వేగం, నాణ్యత వంటివి సమకూరుతాయి. మిషిన్లకు మరింత పరిజ్ఞానాన్ని అందిస్తూ.. తక్కువ మానవ వనరులను వాడే విధానమే ఆటో మేషన్. ఇప్పటికే పలు కంపెనీలు రోబోల రూపంలో తమ ఉత్పత్తులకు మరిన్ని మెరుగులను దిద్దుతున్నాయి. ఆటో మేషన్ వల్ల తాత్కాలికంగా ఉద్యోగాలు పోయినా.. భవిష్యత్తులో ఉపాధి కల్పన మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 
మరో వైపు ఈ ఆటోమేషన్ వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు , ఉపాధి అవకాశాలు కోల్పోనున్నామని పలు హ్యూమన్ రిసోర్సెస్ నిపుణులు భావిస్తున్నారు. ఆటోమేషన్ వల్ల కంపెనీలకు భారీ స్థాయిలో లాభాలు వస్తాయని, అదే సమయంలో ఉద్యోగులకు వేతన భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతుందనేది ప్రధాన ఆరోపణ. కీలక నిర్ణయాలు, ఉత్పత్తులపై ఖచ్చితమైన నాణ్యత ఉంటుంది కాబట్టి పలు కంపెనీలు ఆటోమేషన్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి. యాంత్రీకరణ పెరిగే కొద్ది ఉద్యోగాల్లో భారీ కోత ఉండొచ్చన్నది నిపుణుల వాదనగా ఉంది. 
ఈ ఆటోమేషన్ వల్ల రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌లో ఉన్న ప్రస్తుత ఉద్యోగాల్లో 69శాతం కోత ఉండొచ్చని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంటోంది. కాగా ఆటో మేషన్ వల్ల ఉద్యోగాలు పోవని, కేవలం ఉద్యోగ సామర్ధ్యం, కచ్చితత్వం పెరుగుతాయని మరి కొందరి వాదన. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వేగంగా పుంజుకోవడం ఇక్కడ కొసమెరుపు. 


 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');