బ్లూచిప్స్‌ దెబ్బ- డోజోన్స్‌ డౌన్‌

బ్లూచిప్స్‌ దెబ్బ- డోజోన్స్‌ డౌన్‌

ఇంజినీరింగ్‌ దిగ్గజం బోయింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సెంటిమెంటును దెబ్బతీయడంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ప్రధానంగా డోజోన్స్‌ 256 పాయింట్లు(1 శాతం) పతనమై 26,770 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 12 పాయింట్లు(0.4 శాతం) క్షీణించి 2,986 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 67 పాయింట్లు(0.83 శాతం) తిరోగమించి 8,089 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్‌)లో చైనా జీడీపీ వృద్ధి 30 ఏళ్ల కనిష్టమైన 6 శాతానికి పరిమితంకావడంతో ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలు మరోసారి తలెత్తినట్లు నిపుణులు తెలియజేశారు. తాజాగా ప్రపంచ వృద్ధి 3 శాతానికి పరిమితంకావచ్చంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) అంచనా వేయడం దీనికి జత కలసినట్లు పేర్కొన్నారు. 

Image result for american express

పతన బాటలో
ఇటీవల విక్రయాలు నిలిపివేసిన 737 మ్యాక్స్‌ విమానాల రక్షణ సంబంధ అంశాలపై అమెరికా న్యాయశాఖను కంపెనీ తప్పుదోవ పట్టించినట్లు ఇద్దరు ఉద్యోగుల మెసేజీలు వెల్లడించిన వార్తలతో బోయింగ్‌ ఇంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి బోయింగ్‌ షేరు 7 శాతం పతనమైంది. ఇక మరోవైపు బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు నియంత్రణ అధికారులు గుర్తించడంతో మార్కెట్‌ నుంచి వీటిని కంపెనీ ఉపసంహరిచనున్నట్లు వెలువడిన వార్తలు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కౌంటర్‌ను దెబ్బతీశాయి. ఈ షేరు 6.2 శాతం దిగజారింది. కాగా.. అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించినప్పటికీ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ షేరు 2 శాతం క్షీణించగా.. ష్లమ్‌బెర్గర్‌ ఎన్‌వీ 1.3 శాతం పుంజుకుంది. ఆయిల్‌ ఫీల్డ్‌ సర్వీసుల ష్లమ్‌బెర్గర్.. సాఫ్ట్‌వేర్‌ సర్వీసులవైపు దృష్టిపెట్టడంతో 12 బిలియన్‌ డాలర్ల త్రైమాసిక నష్టాలు ప్రకటించిండం గమనార్హం! అయితే ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ఆకట్టుకోవడంతో పానీయాల దిగ్గజం కోక కోలా షేరు 2 శాతం ఎగసింది. ఈ బాటలో ఫలితాలు ఆకట్టుకోవడంతో రైల్‌రోడ్‌ నిర్వాహక కంపెనీ కన్సాస్‌ సిటీ సదరన్‌ షేరు 7.3 శాతం జంప్‌చేసింది. 

ఫలితాల క్యూ
ఈ వారం త్రైమాసిక(జులై-సెప్టెంబర్‌) ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్‌ కంపెనీల జాబితాలో ప్రాక్టర్ అండ్‌ గ్యాంబుల్‌, కేటర్‌పిల్లర్‌ ఇంక్‌, బోయింగ్, మైక్రోసాఫ్ట్‌, కార్ప్‌, ఫోర్డ్‌ మోటార్‌, 3ఎం కో, ట్విటర్‌ ఇంక్‌, అమెజాన్‌.కామ్‌, యునైటెడ్‌ పార్సెల్‌ సర్వీస్‌ తదితరాలున్నాయి.

లాభాల్లో
బ్రెక్సిట్‌ డీల్‌ను గడువును మరోసారి పెంచాలంటూ బ్రిటిష్‌ పార్లమెంట్‌ నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం యూరోపియన్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.2 శాతం చొప్పున బలపడ్డాయి. ఇక ఆసియాలోనూ సానుకూల ధోరణి నమోదైంది. సింగపూర్‌ 0.8 శాతం పుంజుకోగా.. జపాన్‌, కొరియా, ఇండొనేసియా 0.2-0.1 శాతం మధ్య లాభపడ్డాయి. మిగిలిన మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌ నామమాత్ర లాభాలతో నిలవగా.. థాయ్‌లాండ్‌ 0.65 శాతం క్షీణించింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');