గత వారం దేశీ మార్కెట్లు గెలాప్‌

గత వారం దేశీ మార్కెట్లు గెలాప్‌

గత వారం ప్రధానంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు అమెరికా, చైనా మధ్య మైత్రి, బ్రెక్సిట్‌ డీల్‌, దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు జోష్‌నిచ్చాయి. దీంతో స్వల్ప ఒడిదొడుకుల మధ్య గత వారం మార్కెట్లు దూకుడు చూపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్‌ నికరంగా 1171 పాయింట్లు(3.1 శాతం) జంప్‌చేసి 39,298 వద్ద ముగిసింది. తద్వారా తిరిగి 39,000 పాయింట్ల కీలక మార్క్‌ ఎగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 361 పాయింట్లు(3.2 శాతం) ఎగసి 11,662 వద్ద నిలిచింది. 

చిన్న షేర్లు.. భళా
గత వారం మార్కెట్లు జోరందుకున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకు సైతం డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 639 పాయింట్లు(4.65 శాతం) దూసుకెళ్లి 14,420 వద్ద స్థిరపడగా.. స్మాల్‌ క్యాప్‌ 355 పాయింట్లు(2.8 శాతం) పెరిగి 13,127 వద్ద ముగిసింది.

బ్లూచిప్స్‌  దూకుడు
గత వారం దిగ్గజ కంపెనీలలో యస్‌ బ్యాంక్‌ 30 శాతం దూసుకెళ్లగా.. టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఐషర్, ఇండస్‌ఇండ్‌, మారుతీ, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం తదితరాలు 13-6 శాతం మధ్య  జంప్‌చేయగా.. ఇన్ఫోసిస్‌ 6 శాతం పతనం పతనమైంది.

పీఎస్‌యూ జోరు
గత వారం మిడ్‌ క్యాప్స్‌లో న్యూ ఇండియా, జనరల్‌ ఇన్సూరెన్స్‌, హింద్‌ కాపర్‌, ఎడిల్‌వీజ్‌, అదానీ ఎంటర్‌, బీహెచ్‌ఈఎల్, వక్రంగీ, ఎంఎంటీసీ, బ్లిస్‌ జీవీఎస్‌, ఇండియన్‌ ఎనర్జీ, జామ్నా ఆటో తదితరాలు 48-18 శాతం మధ్య దూసుకెళ్లాయి.  కాగా.. మరోపక్క ఆర్‌కేపిటల్‌, జైన్‌ ఇరిగేషన్‌, లక్ష్మీవిలాస్‌, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, వాటెక్‌, కాఫీ డే, థామస్‌ కుక్‌, టీవీ 18 బ్రాడ్‌, రైట్స్‌, ఎవరెడీ, ఇండోస్టార్, పీఎన్‌బీ హౌసింగ్‌, గ్రీవ్స్‌ కాటన్‌, బంధన్‌ బ్యాంక్‌ తదితరాలు 23-5 శాతం మధ్య కుప్పకూలాయి.