ఎలికాన్‌ క్యాస్ట్‌- టీవీఎస్‌.. స్పీడ్‌

ఎలికాన్‌ క్యాస్ట్‌- టీవీఎస్‌.. స్పీడ్‌

విదేశీ దిగ్గజ కంపెనీలతో మల్టీఇయర్‌ కాంట్రాక్టులను కదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ ఎలికాన్‌ క్యాస్టల్లాయ్‌ లిమిటెడ్‌ కౌటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరడంతో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎలికాన్‌ క్యాస్టల్లాయ్ షేరు భారీగా లాభపడగా.. టీవీఎస్‌ మోటార్‌ సైతం కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

ఎలికాన్‌ క్యాస్టల్లాయ్‌ లిమిటెడ్‌
అలాయ్‌ ప్రొడక్టుల సరఫరాకు గ్లోబల్‌ దిగ్గజాలతో కనీసం ఐదేళ్లపాటు అమలులో ఉండే విధంగా కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు ఎలికాన్‌ క్యాస్టల్లాయ్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. జేఎల్‌ఆర్‌, దైమ్లర్‌, శామ్‌సంగ్ తదితర ఓఈఎం దిగ్గజాల నుంచి మొత్తం రూ. 810 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు తెలియజేసింది. వీటిలో భాగంగా జేఎల్‌ఆర్‌కు అల్యూమినియం చాసిస్‌, తేలికపాటి అలాయ్‌ ప్రొడక్టులు, దైమ్లర్‌కు హెవీట్రక్‌ ఇంజిన్‌ విడిభాగాలు,  శామ్‌సంగ్‌ ఎస్‌డీఐకు ఈమొబిలిటీ పరికరాలను సరఫరా చేయవలసి ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎలికాన్‌ క్యాస్టల్లాయ్‌ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 399 వరకూ జంప్‌చేసింది. 

Image result for tvs motor company ltd

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ లిమిటెడ్‌ నికర లాభం 20 శాతం పెరిగి రూ. 255 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 4348 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం సైతం 11 శాతం నీరసించి రూ. 382 కోట్లకు చేరింది. కాగా.. గత మూడు రోజుల్లో 17 శాతం ర్యాలీ చేసిన ఈ షేరు మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీవీఎస్‌ మోటార్‌ షేరు 3.3 శాతం పెరిగి రూ. 454 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 460 వరకూ జంప్‌చేసింది.