భెల్‌ భల్లేభల్లే.. జీ కుదేల్‌

భెల్‌ భల్లేభల్లే.. జీ కుదేల్‌

డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటాను విక్రయించనున్నట్లు వెలువడిన వార్తలు విద్యుత్‌ పరికరాల తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్ఈఎల్‌) కౌటర్‌కు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో బీహెచ్‌ఈఎల్‌ షేరు భారీ లాభాలతో హైజంప్‌ చేసింది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో జీ కౌంటర్ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

బీహెచ్‌ఈఎల్‌
విద్యుత్‌ పరికరాల పీఎస్‌యూ దిగ్గజం బీహెచ్‌ఈఎల్‌(భెల్‌)లో వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ దశలలో 26 శాతంవరకూ వాటాను విక్రయించే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం భెల్‌లో కేంద్ర ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. వాటా విక్రయ అంశాన్ని పరిశీలించేందుకు త్వరలోనే ఇందుక సంబంధించిన మంత్రివర్గ బృందం సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన తయారీయేతర యూనిట్లను ప్రయవేట్‌ సంస్థలకు విక్రయించే ప్రతిపాదనలపై సైతం మంత్రివర్గ బృందం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం రూ. 1.05 లక్షల కోట్లను సమీకరించే లక్ష్యాన్ని పెట్టుకున్న విషయం విదితమే. కాగా.. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీహెచ్‌ఈఎల్‌ షేరు 22 శాతం దూసుకెళ్లి రూ. 54.30 వద్ద ట్రేడవుతోంది. తొలుత 27 శాతం జంప్‌చేసి రూ. 56.5కు చేరింది. గత దశాబ్ద కాలంలో ఇది అత్యధిక లాభంకావడం విశేషం!

Image result for zee entertainment

జీ ఎంటర్‌టైన్‌మెంట్
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ నికర లాభం 7 శాతమే పెరిగి రూ. 413 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 7 శాతం పుంజుకుని రూ. 2122 కోట్లను అధిగమించింది. ప్రకటనల ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 1225 కోట్లకు చేరింది. సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 19 శాతం ఎగసి రూ. 723 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 2.5 శాతం బలపడి రూ. 693 కోట్లయ్యింది. ఫలితాల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.2 శాతం పతనమై రూ. 256 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 248 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.  tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');