సెంచరీతో షురూ- అన్ని రంగాలూ

సెంచరీతో షురూ- అన్ని రంగాలూ

ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే జోరందుకున్నాయి. వరుసగా ఆరో రోజు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 157 పాయింట్లు పెరిగి 39,209కు చేరగా.. నిఫ్టీ సైతం 46 పాయింట్లు పుంజుకుని 11,632 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39212-38964 పాయింట్ల మధ్య ఊగిసలాడగా... నిఫ్టీ 11630-11553 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. కాగా.. ఆమోదయోగ్యమైన బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మీడియా డౌన్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగాగా మీడియా 1 శాతం నీరసించింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 8 శాతం జంప్‌చేయగా.. వేదాంతా, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌, విప్రో 2-1 శాతం మధ్య పెరిగాయి. అయితే జీ దాదాపు 4 శాతం పతనంకాగా.. ఐషర్, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, సన్‌ ఫార్మా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.

బీహెచ్‌ఈఎల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో బీహెచ్‌ఈఎల్‌ 22 శాతం దూసుకెళ్లగా.. ఎన్‌బీసీసీ, సెయిల్‌, జీఎంఆర్‌, నాల్కో, ఎన్‌సీసీ, ఐబీ హౌసింగ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌ 7.6-3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క డిష్‌ టీవీ 5 శాతం పతనంకాగా.. పీవీఆర్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, స్టార్‌, సన్‌ టీవీ, టాటా గ్లోబల్‌ 4-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు జూమ్‌
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ప్రారంభమై ఊపందుకున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ 1200 షేర్లు లాభపడగా..448 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో హింద్‌ కాపర్‌, ఐటీడీ సిమెంట్‌, సింప్లెక్స్‌, రామ్‌కీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఐఐఎఫ్‌ఎల్‌, ఎంఎంటీసీ, ఎంవోఐఎల్‌, నెక్‌లైఫ్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, వాల్‌చంద్‌, నెల్కో తదితరాలు 12-7 శాతం మధ్య జంప్‌చేశాయి.



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');