స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 18)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (అక్టోబర్ 18)
 • గుజరాత్‌లోని దాహెజ్‌ ప్లాంట్‌లో ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన నోసిల్‌
 • నవీ ముంబై, దాహెజ్‌ ప్లాంట్ల సామర్థ్య విస్తరణ కోసం రూ.255 కోట్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించిన నోసిల్‌ బోర్డ్‌
 • వివిధ సంస్థల నుంచి రూ.810 కోట్ల విలువైన ఆర్డర్లను సంపాదించిన అలికాన్‌ క్యాస్టల్లాయ్‌
 • పవరప్‌క్లౌండ్‌ టెక్నాలజీస్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేయనున్న ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, విలువ 15 మిలియన్‌ డాలర్లు
 • ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.100 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌
 • రూ.250 కోట్ల నిధుల సమీకరణకు షెమారో ఎంటర్‌టైన్‌మెంట్‌ బోర్డు అనుమతి
 • అక్టోబర్‌ 23న జరిగే బోర్డు మీటింగ్‌లో నిధుల సేకరణ అంశాన్ని పరిశీలించనున్న అర్వింద్‌ ఫ్యాషన్స్‌
 • 1:2 నిష్పత్తిలో స్టాక్‌ విభజనకు అంగీకరించిన ఐఎస్‌టీ బోర్డు
 • క్యూ-2లో టీవీఎస్‌ మోటార్‌ నికరలాభం 15శాతం వృద్ధితో రూ.256.88 కోట్లుగా నమోదు
 • రెండో త్రైమాసికంలో 9.27శాతం క్షీణతతో రూ.4960.27 కోట్లకు తగ్గిన టీవీఎస్‌ మోటార్‌ మొత్తం ఆదాయం
 • గత  ఏడాదితో పోలిస్తే క్యూ-2లో రూ.127 కోట్ల నుంచి రూ.98.5 కోట్లకు తగ్గిన సైయెంట్‌ నికరలాభం
 • రూ.5 ముఖవిలువ కలిగిన ఒక్కో షేర్‌పై రూ.6 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని ప్రతిపాదించిన సైయెంట్ బోర్డు, ఈనెల 31 రికార్డ్‌ డేట్‌ 
 • బీఎఫ్‌ యుటిలిటీస్‌, అదాని గ్రీన్‌ ఎనర్జీ, ఐటీడీసీ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు