ఐటీ అండ- 4వ రోజూ ఖుషీ 

ఐటీ అండ- 4వ రోజూ ఖుషీ 

వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్లు బలపడి 38,599 వద్ద నిలవగా... నిఫ్టీ సైతం 36 పాయింట్లు పుంజుకుని 11,464 వద్ద స్థిరపడింది. ఆమోదయోగ్యమైన బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న వార్తలతో మంగళవారం మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు ఊపందుకోగా.. బ్లూచిప్‌ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలతో అమెరికన్‌ మార్కెట్లు పురోగమించాయి. ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొనడంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌లో అమ్మకాలు పెరిగి నష్టాలలోకి ప్రవేశించినప్పటికీ చివరికి లాభాలతో నిలిచాయి. 

రియల్టీ, ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, రియల్టీ, మీడియా, ఫార్మా రంగాలు 1-0.65 శాతం స్థాయిలో లాభపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో 0.8-0.2 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, జీ, బజాజ్ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, ఓఎన్‌జీసీ, విప్రో, యస్‌ బ్యాంక్‌, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా 4.3-1.6 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, వేదాంతా,  హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌, ఎస్‌బీఐ 2.8-1 శాతం మధ్య క్షీణించాయి.

ఐబీ హౌసింగ్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలోఐడియా, అశోక్‌ లేలాండ్‌, మహానగర్‌ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా ఎలక్సీ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐబీ హౌసింగ్‌ 11 శాతం కుప్పకూలగా.. ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, టొరంట్‌ ఫార్మా, చోళమండలం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎక్స్సైడ్‌, టాటా పవర్‌, క్యాస్ట్రాల్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4-2.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు ఫ్లాట్‌
మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిసిన నేపథ్యంలొ మధ్య, చిన్నతరహా కౌంటర్లు అటూఇటుగా ట్రేడయ్యాయి. బీఎస్‌ఈలో 1150 షేర్లు లాభపడగా.. 1318 నష్టాలతో నిలిచాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 436 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 929 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. వారాంతాన రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు సోమవారం మరోసారి రూ. 896 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఇక శుక్రవారం రూ. 703 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న డీఐఐలు సోమవారం తిరిగి రూ. 425 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');