సెన్సెక్స్‌ సెంచరీ- బ్యాంక్స్‌ దన్ను

సెన్సెక్స్‌ సెంచరీ- బ్యాంక్స్‌ దన్ను

సక్రమ బ్రెక్సిట్‌కు వీలుగా బ్రిటన్‌తో యూరోపియన్‌ యూనియన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న వార్తలకుతోడు బ్లూచిప్‌ కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో మంగళవారం యూరోపియన్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 142 పాయింట్లు పుంజుకుని 38,648 వద్ద ట్రేడవుతోంది. ఇక  నిఫ్టీ సైతం 43 పాయింట్లు బలపడి 11,471 వద్ద ట్రేడవుతోంది. 

మెటల్‌, ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, బ్యాంక్స్‌, రియల్టీ, ఐటీ 1 శాతం స్థాయిలో లాభపడగా.. మెటల్‌ 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌ 4.2 శాతం జంప్‌చేయగా.. జీ, బజాజ్ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, విప్రో, యస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌, ఐవోసీ, అల్ట్రాటెక్‌ 2.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే వేదాంతా, ఐషర్‌, ఇన్ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, సిప్లా, గెయిల్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌ 2-0.75 శాతం మధ్య క్షీణించాయి.

డెరివేటివ్స్‌ ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌బీసీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐడియా, ఏసీసీ, ఉజ్జీవన్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 3-2 శాతం మధ్య జంప్‌చేయగా.. టొరంట్‌ ఫార్మా, సెంచురీ టెక్స్‌, కాల్గేట్‌ పామోలివ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, అరబిందో ఫార్మా 1.4-1 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలొ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.4 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ 673 షేర్లు లాభపడగా.. 510 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో బజాజ్‌ కన్జూమర్, ఈకేసీ, కోస్టల్‌ కార్ప్‌, బీఎఫ్‌ యుటి, హిమాద్రి, పనామా, ఎంసీఎక్స్‌, ఐనాక్స్ విండ్‌, డేటామాటిక్స్‌, బిర్లా మనీ, జీఐసీ హౌసింగ్‌ 19-6 శాతం మధ్య జంప్‌చేశాయి.