బ్రెక్సిట్‌ డీల్‌?- మార్కెట్లకు కిక్‌ 

బ్రెక్సిట్‌ డీల్‌?- మార్కెట్లకు కిక్‌ 

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగేందుకు(బ్రెక్సిట్) డీల్‌ కుదరనున్న వార్తలతో మంగళవారం చివర్లో అటు యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు జోరందుకోగా.. ఇటు అమెరికా మార్కెట్లు సైతం లాభపడ్డాయి. సక్రమ బ్రెక్సిట్‌కు వీలుగా యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు బ్రిటన్‌తో డీల్‌ కుదుర్చుకోనున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా మంగళవారం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ 1 శాతం చొప్పున పుంజుకోగా.. యూకే మాత్రం యథాతథంగా ముగిసింది. ఇక అమెరికా మార్కెట్లలో డోజోన్స్‌ 237 పాయింట్లు(0.1 శాతం) ఎగసి 27,025 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(1 శాతం) పురోగమించి 2,996 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 100 పాయింట్లు(1.25 శాతం) జంప్‌చేసి 8,149 వద్ద స్థిరపడింది. 

Image result for unitedhealth groupImage result for jp morgan chase logo

చైనా ఓకే
వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు మరిన్ని చర్చలు చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు వెలువడిన  వార్తల కారణంగా సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. అయితే చైనా ఇందుకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కార్పొరేట్‌ దిగ్గజాలు క్యూ3(జులై-సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

బ్లూచిప్స్‌ దన్ను
బ్యాంకింగ్‌ దిగ్గజం జేపీ మోర్గాన్‌ చేజ్‌, బీమా రంగ దిగ్గజం యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్‌ 8.2 శాతం దూసుకెళ్లగా.. జేపీ మోర్గాన్‌ చేజ్‌ 3 శాతం, జేఅండ్‌జే 1.6 శాతం చొప్పున ఎగశాయి. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ మార్కెట్లు ముగిశాక పనితీరు వెల్లడించింది. ఈ బాటలో నేడు నెట్‌ఫ్లిక్స్‌, ఐబీఎం, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి.
 
ప్లస్‌లో..
ప్రస్తుతం ఆసియాలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్‌ 1.5 శాతం, సింగపూర్‌, కొరియా 0.6 శాతం చొప్పున లాభపడగా.. తైవాన్‌, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌ 0.5-0.2 శాతం మధ్య బలపడ్డాయి. మిగిలిన మార్కెట్లలో చైనా స్వల్ప లాభంతో కదులుతుంటే.. హాంకాంగ్‌ నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది. కాగా.. కరెన్సీ మార్కెట్లలో డాలరు ఇండెక్స్‌ 98.43కు చేరగా.. జపనీస్‌ యెన్‌ 109.82కు బలహీనపడింది. యూరో 1.103 వద్ద స్థిరంగా కదులుతోంది. చైనీస్ యువాన్‌ 7.086ను తాకింది. బ్రెక్సిట్‌ డీల్‌పై అంచనాలతో  బ్రిటిష్‌ పౌండ్‌ 1.27కు ఎగసింది. 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.769 శాతానికి పుంజుకున్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');