మార్కెట్లకు ఆటో, బ్యాంక్స్‌ దన్ను

మార్కెట్లకు ఆటో, బ్యాంక్స్‌ దన్ను

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ పటిష్టంగా కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ దాదాపు లాభాల ట్రిపుల్‌ సాధించింది. 292 పాయింట్లు జంప్‌చేసి 38,506 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 87 పాయింట్లు ఎగసి 11,428 వద్ద స్థిరపడింది. 15 నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే బాటలో పాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు వారాంతాన అమెరికా, చైనా మధ్య అంగీకారం కుదిరింది. అయితే ఈ అంశంలో మరింత చర్చ అవసరమని చైనా యోచిస్తున్నట్లు వెలువడిన వార్తలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే మిడ్‌సెషన్‌కల్లా చైనా పాక్షిక ఒప్పందాన్ని అంగీకరించినట్లు వెలువడిన వార్తలు దేశీయంగా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో చివర్లో నిఫ్టీ సైతం సెంచరీ చేయగా.. సెన్సెక్స్‌ 38,635 వరకూ ఎగసింది.

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో 2.3 శాతం, మెటల్, మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.5 శాతం పుంజుకోగా ఐటీ 0.5 శాతం డీలాపడిది. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, వేదాంతా, జీ, ఓఎన్‌జీసీ, హీరో మోటో, మారుతీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, కొటక్‌ బ్యాంక్‌ 5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే, యూపీఎల్‌ 3-0.5 శాతం మధ్య నీరసించాయి.

జస్ట్‌డయల్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌, స్టార్‌, జిందాల్‌ స్టీల్‌, ఎన్‌ఎండీసీ, డిష్‌ టీవీ, బాష్‌, టీవీఎస్‌ మోటార్‌ 5.5-3.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జస్ట్‌ డయల్, ఐబీ హౌసింగ్‌, ఐడియా, ఐజీఎల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, చోళమండలం, ఆర్‌ఈసీ 5-1.2 శాతం మధ్య పతనమయ్యాయి. 

మిడ్‌ క్యాప్స్ ఓకే
మార్కెట్లు హుషారుగా ముగిసిన నేపథ్యంలో మిడ్‌ క్యాప్స్‌ వెలుగులో నిలిచాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.7 శాతం బలపడింది. ట్రేడైన షేర్లలో 1109 లాభపడగా.. 1360 నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో వారాంతాన రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరోసారి రూ. 896 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. కాగా.. శుక్రవారం రూ. 703 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సోమవారం తిరిగి రూ. 425 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');