ఒప్పందంపై డౌట్‌- యూఎస్‌ వీక్ 

ఒప్పందంపై డౌట్‌- యూఎస్‌ వీక్ 

వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ పాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునే ముందు మరిన్ని చర్చలు చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. దీంతో వారాంతాన హైజంప్‌ చేసిన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం డీలాపడ్డాయి. డోజోన్స్‌ 29 పాయింట్లు(0.1 శాతం) క్షీణించి 26,787 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 4 పాయింట్లు(0.14 శాతం) నీరసించి 2,966 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 8 పాయింట్లు(0.1 శాతం) బలహీనపడి 8,049 వద్ద స్థిరపడింది. మేధో సంపత్తి(ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ), ఫైనాన్షియల్‌ సర్వీసులు, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకునేందుకు వారాంతాన అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా అమెరికా నుంచి 50 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తుల కొనుగోలును చైనా చేపట్టవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. దశలవారీగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా చైనాతో నెలకొన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. 

బ్యాంకులపై చూపు
బ్యాంకింగ్‌ దిగ్గజాలు సిటీగ్రూప్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌ చేజ్‌, వెల్స్‌ఫార్గో నేడు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇటీవల బ్యాంకింగ్‌ కౌంటర్లవైపు చూపు సారించినట్లు నిపుణులు చెబుతున్నారు.
 
ప్లస్‌లో..
సోమవారం యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 0.2-0.5 శాతం మధ్య నీరసించాయి. ప్రస్తుతం ఆసియాలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్‌ 1.7 శాతం, థాయ్‌లాండ్‌ 1.2 శాతం, తైవాన్‌ 0.4 శాతం, కొరియా 0.2 శాతం చొప్పున పుంజుకోగా.. చైనా 0.5 శాతం క్షీణించింది. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా, హాంకాంగ్‌ నామమాత్ర నష్టాలతోనూ, సింగపూర్‌ యథాతథంగా ట్రేడవుతున్నాయి. కాగా.. కరెన్సీ మార్కెట్లలో డాలరు ఇండెక్స్‌ 98.43కు నీరసించగా.. జపనీస్‌ యెన్‌ 108.4కు చేరింది. యూరో 1.10 వద్ద స్థిరంగా కదులుతోంది. చైనీస్ యువాన్‌ 7.086ను తాకింది. బ్రెక్సిట్‌ డీల్‌పై అంచనాలతో  బ్రిటిష్‌ పౌండ్‌ 1.26కు ఎగసింది. 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 23 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 1.74 శాతానికి పుంజుకున్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');