సెన్సెక్స్‌ డబుల్‌- ఆటో స్పీడ్‌

సెన్సెక్స్‌ డబుల్‌- ఆటో స్పీడ్‌

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సాధించింది. 271 పాయింట్లు జంప్‌చేసి 38,485 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 75 పాయింట్లు ఎగసి 11,417 వద్ద ట్రేడవుతోంది. 15 నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే బాటలో పాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు వారాంతాన అమెరికా, చైనా మధ్య అంగీకారం కుదిరింది. అయితే ఈ అంశంలో మరింత చర్చ అవసరమని చైనా యోచిస్తున్నట్లు వెలువడిన వార్తలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఇక ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి.

మెటల్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో 2 శాతం పుంజుకోగా.. మీడియా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 1.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే మెటల్‌ 0.6 శాతం, ఐటీ 0.3 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, జీ, హీరో మోటో, మారుతీ, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, ఐవోసీ, హెచ్‌యూఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, టాటా స్టీల్‌, ఇన్ఫ్రాటెల్, నెస్లే, వేదాంతా, హిందాల్కో 2.2-0.5 శాతం మధ్య నీరసించాయి.

డిష్‌ టీవీ అప్
డెరివేటివ్‌ కౌంటర్లలో డిష్‌ టీవీ, బాష్‌, అదానీ ఎంటర్‌, ఎన్‌సీసీ, హావెల్స్‌, ఎస్కార్ట్స్‌ 5.5-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జస్ట్‌ డయల్, ఐబీ హౌసింగ్‌, సెంచురీ టెక్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడియా, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఐజీఎల్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు హుషారుగా కదులుతున్న నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వెలుగులోకి వచ్చాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4-0.2 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1015 లాభపడగా.. 1006 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో కోస్టల్‌ కార్ప్‌, ఐటీడీసీ, శక్తి పంప్స్‌, షాలిమార్‌, గ్రావిటా, ఎన్‌ఆర్‌బీ, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, వీ2 రిటైల్‌, పీపీఏపీ, దోలత్‌, సింజీన్‌ తదితరాలు 16-5 శాతం మధ్య దూసుకెళ్లాయి.