లాభాలతోనే- ఆటో, రియల్టీ అప్‌

లాభాలతోనే- ఆటో, రియల్టీ అప్‌

అమెరికా, చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారం కుదిరిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. 15 నెలల వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అగ్ర దేశాల మైత్రి కుదిరిన వార్తలతో వారాంతాన ప్రపంచ మార్కెట్లు జోరందుకోగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. దీంతో తొలుత సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించింది. 375 పాయింట్లకుపైగా జంప్‌చేసి 38,513 వద్ద గరిష్టాన్ని తాకింది. తదుపరి ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 38,066 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. చివరికి 87 పాయింట్లు జమచేసుకుని 38,214 వద్ద ముగిసింది. ఇక తొలుత 11,420 వరకూ పెరిగిన నిఫ్టీ ఒక దశలో 11,290 వరకూ నీరసించింది. చివరికి 36 పాయింట్లు బలపడి 11,341 వద్ద స్థిరపడింది. 

బ్యాంక్స్‌, ఐటీ డౌన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఆటో రంగాలు 1.6 శాతం పుంజుకోగా.. ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 1.2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.5 శాతం, ఐటీ 0.3 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ 5 శాతం చొప్పున జంప్‌ చేయగా.. ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌, యస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌ 2.6-1.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌ 3.5-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఐబీ హౌసింగ్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐడియా, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, బీఈఎల్‌, స్టార్, అరబిందో, టొరంట్‌ ఫార్మా 7.3-3.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐబీ హౌసింగ్‌ 7 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, బీవోబీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, గ్లెన్‌మార్క్‌, ఎన్‌సీసీ 4-2 శాతం మధ్య క్షీణించాయి. 

మిడ్‌ క్యాప్స్‌ ఓకే
మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య చివరికి లాభాలతో ముగిసిన నేపథ్యంలో మధ్య తరహా కౌంటర్లకు డిమాండ్‌ కనిపించింది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.3 శాతం చొప్పున పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1223 షేర్లు లాభపడగా.. 1281 నష్టాలతో ముగిశాయి. రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌ 6 శాతం, ఇండియాబుల్స్‌ 5 శాతం చొప్పున జంప్‌చేయగా.. సన్‌టెక్‌, ప్రెస్టేజ్‌, మహీంద్రా లైఫ్‌ 1.5 శాతం స్థాయిలో పెరిగాయి.

సీన్‌ రివర్స్‌
నగదు విభాగంలో వారాంతాన రివర్స్‌ సీన్‌ కనిపించింది. కొద్ది రోజులుగా అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే ఇటీవల పెట్టుబడులకే ఆసక్తి చూపుతూ వస్తున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 703 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 263 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 503 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');