మార్కెట్‌ జోరు- ఈ షేర్లు బోర్లా

మార్కెట్‌ జోరు- ఈ షేర్లు బోర్లా

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల అమెరికా, చైనా మధ్య పాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదరడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌ వచ్చింది. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం హుషారుగా ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేయగా.. నిఫ్టీ 60 పాయింట్లు ఎగసింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో రిలయన్స్‌ కేపిటల్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

రిలయన్స్ కేపిటల్‌ లిమిటెడ్‌: అనిల్‌ అంబానీ గ్రూప్‌లోని ఫైనాన్షియల్‌ సేవల ఈ కంపెనీ కౌంటర్లో అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 10 శాతం కుప్పకూలింది. రూ. 16 దిగువకు చేరింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం! ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) పరిమాణం 20.64 లక్షల షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 8.47 లక్షల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌: అనిల్‌ అంబానీ గ్రూప్‌లోని మౌలిక సదుపాయాల సేవల ఈ కంపెనీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 10 శాతం పతనమైంది. రూ. 20 దిగువకు చేరింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం! ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 16.23 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 3.73 లక్షల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌: డైవర్సిఫైడ్‌ బిజినెస్‌లు కలిగిన ఈ వ్యవసాయ రంగ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం తిరోగమించింది. రూ. 13.6కు చేరింది. ఇంట్రాడేలో రూ. 13 వద్ద సరికొత్త కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) ట్రేడింగ్‌ పరిమాణం 2.38 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 2.93 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌: మార్టిగేజ్‌ రుణాల ఈ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.5 శాతం క్షీణించింది. రూ. 467కు చేరింది. ఇంట్రాడేలో రూ. 465 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 15500 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 22,500 షేర్లు ట్రేడయ్యాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');