వొలాటిలిటీలోనూ ఈ షేర్లు స్పీడ్‌

వొలాటిలిటీలోనూ ఈ షేర్లు స్పీడ్‌

ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అమెరికా, చైనా పాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 202 పాయింట్లు ఎగసి 38,329ను తాకింది. ఇక నిఫ్టీ సైతం 63 పాయింట్లు పెరిగి 11, 368 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, పీసీ జ్యువెలర్స్‌ లిమిటెడ్‌, జీటీపీఎల్‌ హాథవే లిమిటెడ్‌, బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌, హారిసన్స్‌ మలయాళం చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌: అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీలలో ఒకటైన ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లింది. రూ. 149కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 5.63 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 4.97 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

పీసీ జ్యువెలర్స్‌ లిమిటెడ్‌: బంగారు ఆభరణాల తయారీ, ఎగుమతులు నిర్వహించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9.6 శాతం జంప్‌చేసింది. రూ. 33ను తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 8.26 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.31 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

జీటీపీఎల్‌ హాథవే లిమిటెడ్‌: కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 15 శాతం దూసుకెళ్లింది రూ. 85కు చేరింది. ఇంట్రాడేలో రూ. 89 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 3300 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 22,000 షేర్లు ట్రేడయ్యాయి. 

బిర్లాసాఫ్ట్‌ లిమిటెడ్‌: ఐటీ సర్వీసులందించే మధ్యస్థాయి ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9 శాతం జంప్‌చేసింది. రూ. 64కు చేరింది. ఇంట్రాడేలో రూ. 66 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 73,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 67,000 షేర్లు ట్రేడయ్యాయి.

హారిసన్స్‌ మలయాళం లిమిటెడ్‌: టీ, తేయాకు తోటల బిజినెస్‌లు నిర్వహించే ఈ ప్రయివేట్‌ రంగ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం ఎగసింది. రూ. 54కు చేరింది. ఇంట్రాడేలో రూ. 59 వరకూ పురోగమించింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 26000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 45700 షేర్లు ట్రేడయ్యాయి.